వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణాఫ్రికాకు సచిన్‌ పయనం

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: తన కుడి కాలు బొటనవేలికి చికిత్స చేయించుకునేందుకు భారత సంచలన బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఆదివారం ఉదయం దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లాడు. అక్కడ సచిన్‌ ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ మార్క్‌ఫెర్గూసన్‌తో తన కుడి కాలు బొటన వేలి ఫ్రాక్చర్‌కు చికిత్స చేయించుకుంటాడు.

ఈ చికిత్స అనంతరం అతనుఅక్టోబర్‌ ఒకటవ తేదీ నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే క్రికెట్‌ పోటీల్లో పాల్గొంటాడని భావిస్తున్నారు.జింబాబ్వేలో జరిగిన త్రిముఖ పోటీల వెస్టీండీస్‌తో జులై 4వ తేదీన జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్‌ గాయపడ్డాడు. ఈ గాయం వల్ల అతను శ్రీలంక పర్యటనకు వెళ్లలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X