• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రధాని ప్రకటనపై లోక్‌సభలో దుమారం

By Staff
|

న్యూఢిల్లీ: అయోధ్యవివాదంపై ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి లక్నో చేసిన ప్రకటన సోమవారం లోక్‌సభలో దుమారం రేపింది. అయోధ్యవివాదం పరిష్కారానికి చర్చలు జరుగుతున్నాయని, మార్చి 12వ తేదీ లోగా పరిష్కారం కాగలదని ఆయన ఆదివారం

విలేకరుల సమవేశంలో అన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా ఇటువంటి ప్రధానమైనఅంశంపై ప్రధాని పార్లమెంటు వెలుపల ప్రకటన చేయడం పట్ల ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి.

పార్లమెంటునువిశ్వాసంలోకి తీసుకోకుండా, అయోధ్య వివాదం కోర్టుల పరిధిలో వుండగా ప్రధాని ఈ విధమైన ప్రకటన చేయడం సరికాదని కాంగ్రెస్‌ అన్నది. ప్రధాని ప్రకటన ఉత్తర ప్రదేశ్‌లో మత వైషమ్యాలకు దారి తీస్తుందని కాంగ్రెస్‌ సభ్యులు అన్నారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ప్రధాని ఆ ప్రకటన చేశారని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. ఎన్నికలు వచ్చినప్పుడు ఈ విధమైన ప్రకటనలు చేయడం ప్రధానికి అలవాటేనని సమాజ్‌వాదీ పార్టీ, బిఎస్‌పి అన్నాయి.

అయోధ్య వివాదంపై జరుగుతున్న చర్చల వివరాలను వెల్లడించడం ఈ దశలో సాధ్యం కాదని, చర్చలవివరాలను వెల్లడించడం వల్ల అనవసరమైన గందరగోళం చెలరేగుతుందని ప్రధాని వాజ్‌పేయి అన్నారు. చర్చలు జరుపుతున్న వర్గాలపేర్లు, ఇతర వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. కావాలనుకుంటే తాను పార్లమెంటు వెలుపల ప్రకటన చేయడంపైస్పీకర్‌ రూలింగ్‌ ఇవ్వవచ్చునని ఆయన అన్నారు. పార్లమెంటు వెలుపల చెప్పకూడదనేది తనకు కూడా తెలుసునని, అయితేవిలేకరులు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిన బాధ్యత కూడా తనపై వున్నదని వాజ్‌పేయి సమర్థించుకున్నారు.

ప్రధాని ప్రకటనపై బిజెపి హర్షం వ్యక్తం చేయగా, సమస్య ఏ విధంగానైనా శాంతియుతంగా పరిష్కారం కావడం అవసరమని తెలుగుదేశం పార్టీ అన్నది

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more