• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కృషి దెబ్బకుబ్యాంకుల విలవిల

By Staff
|
కృషిబ్యాంకు సంక్షోభం రాష్ట్రంలోని అనేక బ్యాంకులపాలిట శాపంగా మారింది. కృషి ఉదంతంతో ఇతర అర్బన్‌బ్యాంకుల్లో డిపాజిట్లు వున్న ఇన్వెస్టర్లు తమసొమ్ము వెనక్కి తీసుకోవడానికి పెద్ద సంఖ్యలోముందుకు వస్తుండటంతో ఉన్నఫళంగా పెద్దమొత్తంలో సొమ్ము సర్ధలేక అనేక బ్యాంకులుబెంబేలెత్తుతున్నాయి.

కృషివ్యవహారాన్ని పద్దతి ప్రకారం ఎదుర్కోవడంలో విఫలమైన అధికారులు ఇతర బ్యాంకుల పీకలమీదకుతెచ్చారని సహకార బ్యాంకుల సంఘం ఆరోపిస్తున్నది.కషి బ్యాంకు సంఘటన నేపథ్యంలో రాష్ట్రంలోనిబలహీనబ్యాంకుల జాబితాను ఆర్‌బిఐ విడుదలచేసింది. ఈ జాబితాలో పాతతరం అర్బన్‌ బ్యాంకుల్లోఒకటైన వాసవి అర్బన్‌ బ్యాంకు పేరు కూడా వుంది.దాంతో గత రెండు రోజులుగా ఈ బ్యాంకు శాఖల ముందుచాంతాడు క్యూలు ప్రారంభమయ్యాయి. నిజానికి వాసవిబ్యాంకు ఏ ప్రమాణాల దృష్ట్యా చూసినా పుట్టిముంచేరకం బ్యాంకు కాదు.

అయితేఆర్‌బిఐ లెక్కల ప్రకారం మొండిపద్దులు 15 శాతాన్నిమించిన బ్యాంకులన్నీ బలహీన బ్యాంకులజాబితాలోకి వస్తాయి. వాసవి బ్యాంకు మొండి పద్దులుఈ లక్ష్మణరేఖ కంటే మూడు శాతం అధికంగా18 శాతం వున్నాయి. వాసవి బ్యాంకుకు సుదీర్ఘమైనచరిత్రనే కాకుండా రాష్ట్రంలోని బలమైన వాణిజ్యవర్గానికిచెందిన దన్ను వుంది. నిజానికి వాసవి వంటిబ్యాంకులకు ఈ మొండి పద్దుల మొత్తం పెద్దలెక్కలోనిది కాదు. ఆదివారం నాడు వాసవిబ్యాంకుబేగం పేట శాఖనుంచి ఒక్కరోజులోనే సుమారు3 కోట్ల రూపాయలను డిపాజిటర్లు విత్‌డ్రా చేసుకున్నారు.

ఈ బ్యాంకుకు నగరంలో 26 శాఖలు వున్నాయి. నగరంవెలువల నంద్యాలలో ఒక శాఖ వుంది. సోమవారంనాడు ఈ 26 శాఖల వద్ద ఇదే విధమైన పరిస్థితిఏర్పడే ప్రమాదం వున్నదన్న భయంతోముందు జాగ్రత్తంగా ఆదివారం నాడు సుమారు 20కోట్ల రూపాయలమేర బ్యాంకు పాలకమండలిసమీకరించింది. తక్కువ మొత్తాలు వున్నవారికినగదు, ఎక్కువ మొత్తాలు వున్నవారికి చెక్కులుజారీ చేయాల్సిందిగా బ్యాంకుల మేనేజర్లనుఆదేశించినట్టుగా బ్యాంకు పాలకమండలి ప్రతినిధులుతెలిపారు.

ఆర్‌బిఐ,సహకార శాఖ అధికారుల ధోరణి సంక్షోభాన్నిపరిష్కరించేట్టుగా కాకుండా మరింత సంక్షోభాన్నిసృష్టించేట్టుగా వున్నదని విమర్శలు వస్తున్నాయి.డిపాజిటర్లకు మేలు చేసే విధంగా కాకుండా డిపాజిటర్లనుమరింత భయాందోళనలో నెట్టేవిధంగావ్యవహరిస్తున్నట్టుగా సహకార బ్యాంకులసంఘం ఆరోపిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని సహకారబ్యాంకుల పరిస్థితిని శాస్త్రీయంగా మదింపు వేసికృషి బాటలో వున్న బ్యాంకుల బండారం బయటపెట్టాల్సినఆర్‌బిఐ అనేక దశాబ్దాలుగా మర్యాదగా వ్యాపారం చేసుకుంటున్నసహకార బ్యాంకులను కూడా సంక్షోభంలోకి దించిందనిపరిశీలకులు అంటున్నారు.

వాసవిబ్యాంకుతో పాటు నగరానికే చెందిన మరో ప్రముఖసహకార బ్యాంకు పై కూడా విత్‌డ్రాల వత్తిడి ప్రారంభమైంది.కృషి బ్యాంకు పుట్టుకువచ్చిన సమయంలోనేవెలసిన ఒక సహకార బ్యాంకు జవహర్‌ వ్యవహారంకూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ బ్యాంకుకూడా 21 శాతం వార్షిక వడ్డీ ఆశ చూపి సుమారు 20కోట్ల రూపాయల మేర డిపాజిట్లు సమీకరించింది.అడ్డగోలుగా రుణాలు మంజురు చేసి 50 శాతం మేరమొండి బకాయిలను చూపిస్తున్నదని గతజనవరి నుంచి డిపాజిటర్లకు మొండి చేయిచూపడం ప్రారంభించిందని అంటున్నారు. కృషిపైరచ్చ ప్రారంభమైన తర్వాత ఈ బ్యాంకు డిపాజిటర్లుకూడా ముందుకు వచ్చి అధికారులకు ఫిర్యాదుచేసినట్టుగా తెలిసింది. ఇలాంటి బ్యాంకులనుసకాలంలో పట్టుకుని పాలకవర్గ సభ్యుల ఆస్తులనుజప్తు చేసి వున్న నిధులను మరింత దుర్వినియోగంచేయకుండా నిరోధించడంలో ప్రభుత్వయంత్రంగావిఫలమవుతున్నది.


తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more