• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిటీలో ఇద్దరు ఐఎస్‌ఐ ఏజెంట్లఅరెస్టు

By Staff
|

హైదరాబాద్‌: ఇంటర్‌సర్వీస్‌ ఇంటలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) ఏజెంట్లుగా అనుమానిస్తున్న ఇద్దర్ని పోలీసులు హైదరాబాద్‌లోఅరెస్టు చేశారు. ఈ ఇద్దరిని అరెస్టు చేయడం ద్వారా హైదరాబాద్‌లో మత విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రను భగ్నం చేసినట్లు రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) హెచ్‌.జె. దొరవిలేకరులతో చెప్పారు. వారి నుంచి లక్ష రూపాయల నగదును, బెల్జియం పిస్టల్‌ను, ఆయుధాలను, మందుగుండు సామగ్రిని, ఆడియో, వీడియో క్యాసెట్లనుస్వాధీనం చేసుకున్నట్లు ఆయన బుధవారం తెలిపారు.

మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సమీపంలో స్కూటర్‌పై వెళ్తుండగా హైదరాబాద్‌ నగర పోలీసు శాఖ నుంచి 1993లో తప్పుకున్న 29 ఏళ్ల మహ్మద్‌ నిస్సార్‌, అబ్దుల్‌ అజీజ్‌ అలియాస్‌ ఆష్రఫ్‌ అలియాస్‌ జిద్దాలను రాష్ట్ర ఇంటలిజెన్స్‌ కౌంటర్‌ ఇంటలిజెన్స్‌, నగరటాస్క్‌ఫోర్స్‌ల ప్రత్యేక బృందం పట్టుకుంది.

అజీజ్‌ 1980 ప్రాంతంలో నగరానికి చెందిన మతతత్వ సంస్థ దర్స్‌ఘాజిహాద్‌ సహాదత్‌ (డిజెఎస్‌) క్రియాశీలక సభ్యుడని, ఫసియుద్దీన్‌, ఆజంఘోరీలతో, ఇతర మత విచ్ఛిన్నకారులతో ఇతనికి సంబంధాలుండేవని దొర చెప్పారు.

దొర వెల్లడించిన వివరాల ప్రకారం- అజీజ్‌ 1980లో సౌదీఅరేబియా వెళ్లాడు. అక్కడ ఎలక్ట్రీసియన్‌గా పని చేసి రెండేళ్ల తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. ఫిసియుద్దీన్‌ మరణించిన తర్వాత అతను 1993లో అతను మళ్లీ సౌదీఅరేబియాలోని ఆల్‌-ఖుబార్‌

వెళ్లాడు. జిహాద్‌ వాలంటీర్లకు సహాయం చేసే ఒకస్వచ్ఛంద సంస్థలో అతను అరబిక్‌ క్లర్క్‌గా పని చేశాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more