వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశీ సంస్థలతో సత్యం ఒప్పందం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః అమెరికాకు చెందిన సీక్‌ ఐఎన్‌సితో హైదరాబాద్‌ సంస్థ సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండు సంస్థలు ఉమ్మడిగా నెక్ట్స్‌ జనరేషన్‌ వెబ్‌ సొల్యూషన్స్‌ను అందజేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా బీమా రంగ సంస్థలు ఇతర సంస్థలకు వెబ్‌ సొల్యూషన్స్‌ అందజేయడంలో సీక్‌ అగ్రగామిగా వుంది.

ప్రస్తుత ఒప్పందం ప్రకారం ఈ రెండు సంస్థలు ఉమ్మడిగా కాంపోనెంట్‌, వెబ్‌ సర్వీస్‌ సొల్యూషన్స్‌ను ఉమ్మడిగా అందజేస్తాయి. సీక్‌ ప్రమోటర్‌ కూడా ప్రవాసాంధ్రుడైన రవి కోట కావడం విశేషం.

ఇదిలా వుండగా అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ప్రాడక్ట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ పిటిసితో కూడా సత్యం కంప్యూటర్స్‌ మరో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం విండ్‌చిల్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌ విండ్‌చిల్‌ను మరింత అభివృద్ధి చేయడానికి రెండు కంపెనీలు ఇంటర్నెట్‌ సొల్యూషన్స్‌లో తమ నైపుణ్యాన్ని, అనుభవాన్ని కలసికట్టుగా ఉపయోగిస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X