వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృషి చైర్మన్‌అరెస్టు?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః గత కొద్ది వారాలుగా పోలీసుల కళ్లుకప్పి రాష్ట్రంలోనే తలదాచుకున్న కృషిబాంకు చైర్మన్‌ కొసరాజు వెంకటేశ్వరరావును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే పోలీసులు మాత్రం ఈ విషయం ధృవీకరించలేదు. కృషి బాంకు డైరెక్టర్‌ పెనుగొండ రామమూర్తిని మంగళవారం నాడు రాజమండ్రిలో అరెస్టు చేసినట్టు మాత్రం పోలీసులు చెబుతున్నారు.

రామమూర్తి చెప్పిన సమాచారం మేరకు అమలాపురంలో బంధువుల ఇంట్లో వున్న వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్టుగావిశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఈ వార్తను నిర్ధారించకుండా ఒకటి రెండు రోజుల్లో వెంకటేశ్వరరావు లొంగిపోవడం ఖాయమని ఆయన ఎక్కడవుంది తమకు ఇప్పటికే తెలిసిందనిఅంటున్నారు. ఇదిలా వుండగా కొందరు పోలీసు పెద్దల సూచనల మేరకు వెంకటేశ్వరరావేస్వయంగా పోలీసులకు తానెక్కడ వున్నది సమాచారంఅందించి లొంగిపోయినట్టుగా చెబుతున్నారు. వెంకటేశ్వరరావు సోదరి సునీత కూడా పోలీసుల అదుపులో వున్నట్టుగా చెబుతున్నారు. గత పదిహేను రోజులుగా పోలీసు శాఖను ముప్పుతిప్పలుపెట్టినప్పటికీ వెంకటేశ్వరరావుకు పోలీసుల కస్టడిలో వచ్చిన భయం ఏమీలేదని ఆయన ఇవ్వదల్చిన సమాచారం మాత్రమే ఇస్తారనిఅంటున్నారు.

ఇదిలా వుండగా మంగళవారం నాడు కృషి బ్యాంకుకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని వెల్లడించనున్నట్టుగా పోలీసులు తొలుత ప్రకటించారు. తర్వాత సాయంత్రానికి ప్రస్తుతానికిహాట్‌ న్యూస్‌ ఏమీ లేదని బుధవారం నాడు వుండవచ్చని ప్రకటించారు. కృషి వ్యవహారంలో పోలీసుల పాత్రపై కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి కృషి వంటి కేసులో పోలీసులు చిత్తశుద్దితో వ్యవహరిస్తే ప్రొబేషనరీ ఎస్‌ఐ స్థాయి అధికారి కూడా వారం రోజుల్లో వెంకటేశ్వరరావును తెచ్చిసెల్లో వేసేవాడని, కేసు సిబిసిఐడి చేతికి వెళ్లేవరకు వెంకటేశ్వరరావు ఆచూకీకోస పోలీసు శాఖసీరియస్‌గా ప్రయత్నాలు చేయలేదని విమర్శలు వస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X