వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజలు ఓటేస్తే హంతకుడు సిఎం కావచ్చా?

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ప్రజల మద్దతు పొందినంత మాత్రాన రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించే అధికారం లభించినట్లు కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జైలుశిక్ష పడిన జయలలిత ముఖ్యమంత్రి కావడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపైవిచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ధర్మాసనం మూడోరోజు వాదనలనువిన్న అనంతరం ఈ విధంగా వ్యాఖ్యానించింది.

జయలలిత తరవు న్యాయవాది వేణుగోపాల్‌కు, సుప్రీంకోర్టు ధర్మాసనం లోని న్యాయమూర్తులకు మధ్య జరిగిన కీలకమైన వాదోపవాదాలసారాంశం.......

జయ తరపు న్యాయవాదిః జయలలితకు శిక్ష పడిందని తెలిసినప్పటికీ తమిళనాడు ప్రజలు ఆమెకు, ఆమె పార్టీకి బ్రహ్మరథం పట్టారు. అన్నా డిఎంకె గెలిస్తే జయలలితే ముఖ్యమంత్రి అవుతుందని కూడా తమిళ ప్రజలకు తెలుసు.అప్పటి గవర్నర్‌ ఫాతిమాబీవి రాజ్యాంగం ప్రకారమే జయను ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు ఆహ్వానించారు.అసెంబ్లీలో మెజారిటీ పొందిన పార్టీ ఎన్నుకున్న వ్యక్తిని సి.ఎం.గా పిలవడం ఆనవాయితీ .

సుప్రీంకోర్టు ధర్మాసనంః ఆనవాయితీలను కాసేపు పక్కనపెట్టి ఆలోచించిద్దాం. ఈ కేసులో రెండు మూడేళ్ళ జైలుశిక్ష పడిన వ్యక్తిసి.ఎం. కావచ్చా? లేదా? అనేది ప్రశ్న కావచ్చు. భవిష్యత్తులో హత్యకేసులో దోషిగా నిర్దారణఅయిన వ్యక్తి లెజిల్లేచర్‌ పార్టీ నేతగా ఎన్నికైతే అప్పుడు కూడా ఇదే ఆనవాయితీని పట్టుకు వేళ్లాడతారా?
గవర్నర్‌ కు వున్న విచక్షణాధికారం గురించి కూడా సందేహపడాల్సి వస్తున్నది. అవినీతి చట్టం కింద శిక్షపడిన వ్యక్తి చేత సి.ఎం.గా ప్రమాణస్వీకారం చేయించవచ్చా? అనేమీమాంస ఇప్పటి వరకు తలెత్తలేదు.... పైగా ఇది రాజ్యాంగం ఊహకు కూడాఅందని వ్యవహారం.

జయ తరపు న్యాయవాదిః జయలలితకు అన్యాయంగా శిక్షపడిందని తమిళనాడు ప్రజలు నమ్మినందువల్లే ఆమెను భారీ మెజారిటీతో గెలిపించారు. ప్రజల తీర్పుకు తిరుగులేదు కాబట్టి ఆమె ముఖ్యమంత్రి అయ్యారు.

సుప్రీంకోర్టు ధర్మాసనంః అలా అనుకున్నా అవినీతి కేసునుంచి బయటపడేంత వరకు జయలలిత వేచి వుండాల్సింది. ప్రజలు ఒప్పుకున్నంత మాత్రాన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కమనడంలోఅర్ధం వున్నదా?

జయ తరపు న్యాయవాదిః అయితే ఒక ఎం.పి.కి శిక్షపడితే పై కోర్టులో ఆ శిక్ష ఖరారయ్యే వరకు వాళ్ళు ఆ పదవిలో కొనసాగుతున్నప్పుడు జయలలిత మాత్రం ముఖ్యమంత్రిగా ఎందుకు కొనసాగకూడదు.పైకోర్టు తుది తీర్పు వెల్లడించే వరకు ఓ హంతకుడుఎంపిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా లేక ప్రధాని గా కొనసాగే అవకాశం వున్నప్పుడు ఆదే సూత్రాన్ని జయలలిత కేసులో వర్తింపచేయాలి కదా?

సుప్రీంకోర్టు ధర్మాసనంః ఎంతటి నేరం చేసిన వ్యక్తిఅయినా ప్రజాప్రతినిధిగా ఎన్నికై ఉన్నత పదవుల్ని చేపడితే ఫరవాలేదంటారా?

జయ తరపు న్యాయవాదిః ప్రజల చేత ఎన్నుకోబడని వ్యక్తిని గవర్నర్‌ ముఖ్యమంత్రిగా నియమించవచ్చా? లేదా? అనేఅంశంపై రాజ్యాంగమే మౌనం వహిస్తున్నప్పుడు న్యాయస్థానం ఎలా జోక్యం చేసుకుంటునంది.

సుప్రీంకోర్టు ధర్మాసనంఃపైకోర్టు ఇచ్చే తీర్పే జయలలిత సి.ఎం.గాఅర్హురాలా కాదా అని నిర్ధారించేందుకు గీటురాయి అంటున్నారు. తమిళనాడు ప్రజలు జయలలితను అన్యాయంగా దోషిగా నిర్ధారించారని భావిస్తున్నారని కూడా చెప్పారు. ఇకపైకోర్టు ప్రసక్తి ఎక్కడిదనేదే మా సందేహం.

జయ తరపు న్యాయవాదిః అనర్హులైనప్పటికీఅసెంబ్లీలో మెజారిటీ సాధించిన పార్టీ ఎన్నుకున్న నేతను ముఖ్యమంత్రిగా ఆహ్వానించడం గవర్నర్‌ బాధ్యత అని రాజ్యాంగం చెబుతున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X