వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృషి కేసులో మరో డైరెక్టర్‌అరెస్ట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కృషి బాంకు కేసులో మరో డైరెక్టర్‌ కూడా అరెస్టయ్యారు. పోతరాజు డేవిడ్‌ దీనా చక్రవర్తి బుధవారం నాడు పోలీసుల ముందు లొంగిపోయారు. పోలీసులు ఆయన్ను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చగా పోలీసు రిమాండ్‌లో వుంచాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.

బ్యాంక్‌ చైర్మన్‌ వెంకటేశ్వరరావు సన్నిహితుడు సతీష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేనా చక్రవర్తి కృషి బ్యాంకు కోసం 5 కోట్ల రూపాయల మేర డిపాజిట్లు సమీకరించినట్టుగా తెలుస్తున్నది. చక్రవర్తితో పాటు బ్యాంక్‌ కంప్యూటర్‌ వ్యవహారాలను పర్యవేక్షించిన మరో ముఖ్యుడు చైర్మన్‌ బంధువు సతీష్‌ కూడా పోలీసులకు లొంగిపోయాడు. ఇప్పటికే బ్యాంకు సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ రామకృష్ణ పోలీసులకు లొంగిపోయినవిషయం విదితమే. రామకృష్ణ, సతీష్‌ తమ అధీనంలో వున్న కారణంగా ఒకటి రెండు రోజుల్లో కృషి కంప్యూటర్ల గుట్టు రట్టు చేసి వెంకటేశ్వరరావు లావాదేవీలన్నింటినీ బయటపెడతామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  • కృషిబ్యాంకు స్కామ్‌ వార్తా కదంబం
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X