• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సమ్మెకట్టిన రెవిన్యూ సిబ్బంది

By Staff
|

హైదరాబాద్‌ః వరస సస్పెన్షన్లు, అపరిష్కృత డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని కోరుతూ గురువారం అర్థరాత్రి నుంచి రెవెన్యూ సిబ్బంది సమ్మెకు దిగనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వున్న సుమారు 50 వేల మంది రెవెన్యూ సిబ్బంది సమ్మెభేరి మోగిస్తున్నారు.

విశాఖ రక్షణ భూముల కుంభకోణంలో సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణతో రెవెన్యూ సిబ్బందిన సస్పెండ్‌ చేయడం ఈపెను వివాదానికి దారితీసింది. గత 20 రోజులుగా రెవెన్యూ సిబ్బందివిశాఖలో నిరసన దీక్షలు చేస్తునే వున్నారు. ఈ తరుణంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం హఠాత్తుగా సమ్మెకు పిలుపునిచ్చింది.
రెవెన్యూ సిబ్బందిపై విధించిన సస్పెన్షన్లను తక్షణం ఎత్తివేయాలని, అపరిష్కృతంగా వున్న సమస్యలను సత్వరంపరిష్కరించా ల్సిందిగా కోరుతూ రెవెన్యూ ఉద్యోగులు సమ్మె భేరి మోగించారు.

అదనంగా రెవెన్యూ సిబ్బందిని నియమించాలని, ఎమ్మార్వోలకు జీపు సౌకర్యం కల్పించాలని, ఉద్యోగులపై ఉన్నతాధికారులు కక్షసాధింపు చర్యలు మానుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. రెవెన్యూ సిబ్బందిలో ఒక వర్గం సమ్మెను వ్యతిరేకిస్తున్నప్పటికీ ఎమ్మార్వో కార్యాలయాల్లో పని స్తంభించి పోయే అవకాశాలు కనిపిస్తున్నారు.

  • కరవు కాలం-సమ్మె అన్యాయంః బాబు
  • 6నుంచి రెవెన్యూ సిబ్బంది సమ్మె

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X