దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  • search

లాడెన్‌ ముందే హెచ్చరించాడా?

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    లండన్‌: ఇజ్రాయెల్‌ కొమ్ము కాస్తున్న అమెరికాపై భారీ ఎత్తున దాడులు చేస్తామని అంతర్జాతీయ టెర్రరిస్టు ఓసామాబిన్‌ లాడెన్‌ మూడు వారాల క్రితమే హెచ్చరించాడు. అతనితో సంబంధాలున్నఅరబ్‌ జర్నలిస్టు అబ్దుల్‌ బరీ అత్వాన్‌ ఈ విషయం చెప్పారు.

    అమెరికాపై దాడుల వెనుక లాడెన్‌, అతని అనుచరుల హస్తం వున్నదని ఆయన అన్నారు. అత్వాన్‌ లండన్‌ నుంచి వెలువడేఅరబ్‌ పత్రిక సంపాదకుడు. ఇది ఇస్లామిక్‌ తీవ్రవాదుల పనే. అమెరికా ప్రయోజనాలపై ఊహించని రీతిలోపెద్ద యెత్తున దాడి చేస్తానని లాడెన్‌ మూడు వారాల క్రింద హెచ్చరించారు అని అత్వాన్‌ గుర్తు చేసుకున్నారు. తానుపెద్ద యెత్తున దాడులకు రంగం సిద్ధం చేస్తున్నట్లు లాడెన్‌ పలు మార్లు సూచనప్రాయంగా చెప్పినా తాముసీరియస్‌గా తీసుకోలేదని ఆయన అన్నారు. అత్వాన్‌ లాడెన్‌ ఇంటర్వ్యూ చేశారు. లాడెన్‌ ముఖ్య అనుచరులు పలువురితో ఆయనకు సంబంధాలున్నాయి.

    ఒసామా బిన్‌ లాడెన్‌ పేరు వింటేనే గత కొద్ది కాలంగా అమెరికా గగుర్పాటుకు గురవుతోంది. 1998లో అఫ్రికాలోని అమెరికా రాయబార కార్యాలయంపేల్చివేతలోనూ, ఈ ఏడాది యెమెన్‌లో అమెరికా నౌకపై బాంబు దాడిలోనూ లాడెన్‌దే ప్రధాన హస్తమని అమెరికా నమ్ముతోంది. లాడెన్‌ను పట్టుకునేందుకు అమెరికా గూఢచార సంస్థ సిఐఎ చేయని ప్రయత్నమంటూ లేదు.

    చాకచక్యంగా అమెరికా కళ్లు కప్పుతున్న లాడెన్‌ ధనవంతులకే ధనవంతుడు. ఇతనుఅఫ్ఘనిస్తాన్‌లో తల దాచుకుంటున్నట్లు సమాచారం. సౌదీఅరేబియాలో జన్మించిన లాడెన్‌ అఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ ప్రమేయాన్ని నిరసిస్తూ దానికి వ్యతిరేకంగా పోరాడాడు. అతనికి ముగ్గురు భార్యలనిఅంటారు. ఇతను సిఐఎ నుంచి శిక్షణ పొందినట్లు కూడాచెప్తారు.

    సంబంధితవార్తలుః

    • అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
    • కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్‌
    • అమెరికా అగ్నిగుండమైన క్రమం...
    • అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం


    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more