వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాడులు మేమే చేశాం: లష్కర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అమెరికాలోని దాడులకు తమదే బాధ్యత అని పాకిస్థాన్‌ కేంద్రంగా పని చేస్తున్న తీవ్రవాద సంస్థ లష్కర్‌-ఎ-తోయిబా చెప్పుకుంది. అయితే, అమెరికా ఇంటలిజెన్స్‌ సంస్థలు మాత్రం అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌ను అనుమానిస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ దాడులపై అమెరికా దర్యాప్తు ప్రారంభించింది. ఒక ట్రక్కునుస్వాధీనం చేసుకుని అందులోని ఇద్దరు వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. హైజాక్‌కుగురైన మూడు విమానాలను దాడులకు వినియోగించగా నాలుగవవిమానం పెన్సిల్వేనియాలో కూలిపోయింది.

దాడులు జరిగిన ప్రాంతాల్లో అమెరికా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. దాడుల్లో గాయపడిన వారితో న్యూయార్క్‌లోని ఆస్పత్రులు నిండిపోయాయి. రక్తదానం చేయడానికి ప్రజలు పరుగులెత్తుతున్నారు. వరల్డ్‌ ట్రేడ్‌సెంటర్‌ ప్రాంతంలో సంచార వైద్య శాలలను ఏర్పాటు చేశారు. శిథిలాలను తొలగిస్తే గానీ ఎంత మంది చనిపోయారనేది తేల్చలేమని అధికారులుఅంటున్నారు.

అమెరికాలోని దాడులను ప్రపంచ దేశాలు నిరసిస్తున్నాయి. ఈ దాడులతో పశ్చిమాసియా దేశాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. పలు దేశాలు తమ సరిహద్దులను మూసివేశాయి. అమెరికాలోని దాడులను ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్‌ ఖండించారు. ఈ దాడులకు తాము భయకంపితులమయ్యామని ఆయనఅన్నారు. దాడుల్లో ఎంత మంది చనిపోయింది చెప్పలేకపోయినప్పటికీ ప్రాణనష్టం భారీగానే వుంటుందని ఆయన అన్నారు. కచ్చితంగా ఇది తీవ్రవాదుల పనే అని ఆయన అన్నారు. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని రూపుమాపాల్సిందేనని ఆయన అన్నారు. అమెరికాకు ఆయన సానుభూతి తెలియజేశారు.

ఈ విపత్కర సమయంలో అధ్యక్షుడు బుష్‌కు అండగా నిలవాలని అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ ప్రజలకువిజ్ఞప్తి చేశారు. అమెరికాకు నాటో దేశాలు తమ పూర్తి మద్దతు తెలియజేశాయి.బ్రిటిన్‌, ఫ్రాన్స్‌, తదితర దేశాలు ఈ దాడులను ఖండించాయి. క్యూబా అధ్యక్షుడు ఫెడరల్‌ క్యాస్ట్రో కూడా ఈ దాడులను ఖండించారు. అమెరికాకు తాము అండగా నిలుస్తామని ఆయన అన్నారు.

ఇరాక్‌ మాత్రం ఈ దాడులను సమర్థించింది. అమెరికా చేసిన గత పాపాలకు ఫలితం అనుభవించిందని ఇరాక్‌ వ్యాఖ్యానించింది.

సంబంధితవార్తలుః

  • కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
  • మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
  • అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
  • ముందేహెచ్చరించిన లాడెన్‌
  • గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్‌
  • ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్‌
  • కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్‌
  • అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
  • అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
  • భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X