వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాడులతో సంబంధం లేదన్న లాడెన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌సెంటర్‌పై, పెంటగాన్‌పై జరిగిన దాడులతో తనకు సంబంధం లేదని అంతర్జాతీయ తీవ్రవాది ఒసామబిన్‌ లాడెన్‌ అన్నాడు. అయితే వాషింగ్టన్‌లో, న్యూయార్క్‌లో వేలాది మంది హత్యను అతను న్యాయమైందిగా అభివర్ణించాడు. అణచివేతదారులపై అణచివేతకు గురవుతున్నవారి ప్రతిస్పందనగా ఈ దాడులను అతను అభివర్ణించాడు. అతని ప్రకటనను పాకిస్థాన్‌ ఉర్దూ పత్రికఔషాఫ్‌ ప్రచురించింది.

లాడెన్‌ ప్రకటనను అతని ప్రత్యేక దూత చదివి వినిపించాడని,అరబిక్‌ నుంచి ఉర్దూలోకి అనువాదం చేశాడనిఔషాఫ్‌ ఎడిటర్‌ హమీద్‌ మీర్‌ చెప్పారు. మరణించినవారు అమాయకులేఅయినప్పటికీ టెర్రిరిస్టు దాడులను లాడెన్‌ ప్రశించినట్లు ఆ పత్రిక రాసింది.పాలస్తీనాలో అమాయకులనే చంపుతున్నారు. ఆ అమాయక ప్రజలను ఎవరు పరిగణనలోకి తీసుకుంటారు? టెర్రిరిస్టు అమెరికా ఈ హత్యల వెనుక వుంది అని లాడెన్‌ అన్నాడు.

అమెరికా తనను చంపడానికి ప్రయత్నిస్తే మరింత ప్రమాదంలో పడుతుందని, ఒక ఒసామాను హత్య చేస్తే వందలాది మంది ఒసామాలు అమెరికాకు వ్యతిరేకంగా పని చేస్తారని అతను హెచ్చరించాడు.

తాను పవిత్ర కార్యక్రమంలో వున్నానని, దీన్ని త్వరలో పూర్తి చేస్తానని, పాలస్తీనాను యూదుల నుంచివిముక్తి చేయడమే తన కార్యక్రమమని, తన అనుచరుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయగలనని అతను అన్నాడు.

వేలాది మంది ముస్లింలు తన పక్కన వున్నారని, వారు ఆత్మాహుతికి కూడా సిద్ధంగానే వున్నారని, వివిధ రంగాల్లో నైపుణ్యం గల డజన్ల కొద్ది ముస్లిం శాస్త్రవేత్తలు తమవిజ్ఞానాన్ని అందించడానికి తయారుగా వున్నారని అతను చెప్పాడు.

ముస్లింలపై అత్యాచారాలు ఆగేవరకు ఇస్లాం వ్యతిరేక శక్తులపై తమజిహాద్‌ కొనసాగుతుందని, తన లాగే ఎంతో మంది సుఖవంతమైన జీవితాన్ని కాలదన్నిజిహాద్‌ మార్గం పట్టారని అతను అన్నాడు.

తమ వద్ద రసాయణ ఆయుధాలేవీ లేవని, కానీ వాటి కన్నా శక్తివంతమైన నైతిక బలం వున్నదని, అమెరికా తన విధానాలు మార్చుకుని ముస్లిం వ్యతిరేక ఎజెండాకుస్వస్తి చెప్పేలా తాము పోరాడగలమని అతను అన్నాడు.

సంబంధితవార్తలుః

  • లాడన్‌పైనే అమెరికా అనుమానం
  • మాటమార్చిన లష్కర్‌
  • మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
  • కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
  • దాడులుమేమే చేశాం: లష్కర్‌
  • అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
  • ముందేహెచ్చరించిన లాడెన్‌
  • గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్‌
  • ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్‌
  • కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్‌
  • అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
  • అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
  • భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X