• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐదుగురు అరబ్బులపై అనుమానం

By Staff
|

న్యూయార్క్‌: వరల్డ్‌ ట్రేడ్‌సెంటర్‌పై, పెంటగాన్‌పై జరిగిన దాడుల మీద అమెరికాపెద్ద యెత్తున దర్యాప్తు ప్రారంభించింది. ఐదుగురుఅరబ్బులను దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. లాడెన్‌తో కూడినఅరబిక్‌ భాషలోని ఫ్లయిట్‌ ట్రయినింగ్‌ మాన్యువల్స్‌ వున్న కారును దర్యాప్తు బృందంస్వాధీనం చేసుకున్న తర్వాత ఐదుగురు అరబ్‌లను అనుమానిస్తున్నట్లు బోస్టన్‌ హెరాల్డ్‌ రాసింది. ఈ ఐదుగురిలో ఇద్దరుఅరబ్‌ ఎమరేట్స్‌ పాస్‌పోర్టులు వున్న సోదరులని, ఒకరు శిక్షణ పొందినపైలట్‌ అని ఆ పత్రిక దర్యాప్తు బృందంలోని వర్గాలను ఉటంకిస్తూ రాసింది. ఐదుగురు పాకిస్థానీ కుటుంబ సభ్యులను కూడా దర్యాప్తు బృందం ప్రశ్నించింది.

దాడుల్లోని మృతుల సంఖ్యను గోరంతలు కొండంతలు చేసి రాయడాన్ని అమెరికా అధికార వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. వరల్డ్‌ ట్రేడ్‌సెంటర్‌పై, పెంటగాన్‌పై జరిగిన దాడుల్లో పది వేల మంది మరణించి వుంటారని పత్రికలురాశాయి.
పెంటగాన్‌లో 800 మంది మరణించారని పత్రికలురాశాయి. అయితే ఇక్కడ మృతుల సంఖ్య వందకు, అంతకు కొంచెం ఎక్కవ మాత్రమే వుంటుందని అధికార వర్గాలంటున్నాయి.
శిథిలాల కింద జీవించి వున్నవారిని రక్షించే పనిలో సహాయక బృందాలు నిమగ్నమై వున్నాయి. ప్రస్తుతం ప్రాణాలను రక్షించడమే ప్రధానమని న్యూయార్క్‌ మేయర్‌ అన్నారు.

సంబంధితవార్తలుః

  • దాడులతోసంబంధం లేదన్న లాడెన్‌
  • మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
  • కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
  • దాడులుమేమే చేశాం: లష్కర్‌
  • అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
  • ముందేహెచ్చరించిన లాడెన్‌
  • గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్‌
  • ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్‌
  • కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్‌
  • అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
  • అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
  • భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X