వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాగాంధీ భారతీయురాలే

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ జాతీయత దృష్ట్యా భారతీయురాలేనని సుప్రీంకోర్టు బుధవారం నాడు స్పష్టం చేసింది. అమేధీ నుంచి సోనియాగాంధీ లోక్‌సభకు ఎన్నికకావడాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటీషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

రాజ్యాంగంలో 5(1)సి ప్రకారం ఆమెకు ఇచ్చిన పత్రాలను వెనక్కి తీసుకోలేదు గనుక ఆమె భారత జాతీయురాలేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆనంద్‌, జస్టిస్‌ లాహోటీ, జస్టిస్‌ దొరైస్వామితో కూడిన రాజ్యాంగధర్మాసనం స్పష్టం చేసింది. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు సోనియాగాంధీ జాతీయతపై తీవ్ర దుమారం లేపినవిషయం విదితమే. సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా మునుముందు ఎన్నికల ప్రచారం సోనియాగాంధీ జాతీయతపై గగ్గోలుపెట్టే అవకాశం ఇక ప్రతిపక్షాలకు వుండదని కాంగ్రెస్‌ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X