వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
వాషింగ్టన్ః టెర్రరిస్టులు ఒక్కసారిగా విరుచుపడి భారీ దాడులకు పాల్పడిన దుర్ఘటనలో ఒక్కపెంటగాన్ లోనే కనీసం 800 మంది మరణించినట్లు ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. వరల్డ్ ట్రేడ్సెంటర్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ సిబ్బంది కృషి చేస్తున్నారు. కుప్పకూలిన వరల్డ్ ట్రేడ్సెంటర్ రెండు టవర్ల శిధిలాల కింద ఇంకా కొందరు జీవించే వున్నారని సహాయ సిబ్బంది చెప్పారు.
పెంటగాన్ లోనే కనీసం 800 మందికిపైగా మరణించారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఎంత మంది మరణించిందీ ఇంకా తెలియలేదు. మృతుల సంఖ్య వేలల్లోనే వుంటుందని భావిస్తున్నారు. అమెరికాకు చెందిన రెండువిమానాలను టెర్రరిస్టులు హైజాక్ చేశారు. ఆవిమానాల్లో 156 మంది ప్రయాణికులున్నారు. యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన రెండువిమానాలను తీవ్రవాదులు హైజాక్ చేశారు. వాటిలో ఒకదానిని పిట్స్ బర్గ్ లో కూల్చి వేశారు. మరోవిమానాన్ని కూడా తీవ్రవాదులు కూల్చి వేశారు. ఈ రెండువిమానాల్లో 110 మంది ప్రయాణికులున్నారు. శిధిలాలలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయ సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
-
సంబంధితవార్తలుః
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
- భారత్దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!