• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సర్కారుకు అఖిలపక్షం మద్దతు

By Staff
|

న్యూఢిల్లీః అమెరికాలో టెర్రరిస్టులు సృష్టించిన నరమేధం దరిమిలా అమెరికా బాసటగా నిలుస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలు సమర్ధించాయి. ప్రధాని వాజ్‌పేయి అధ్యక్షతన శనివారం నాడిక్కడ అఖిల పక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలకు అమెరికాలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసం దరిమిలా తలెత్తిన పరిస్థితులు, పర్యవసానాలపై ప్రభుత్వంఅంచనాలను ప్రధాని వాజ్‌పేయి వివరించారు. ప్రభుత్వం వైఖరిని సమర్ధిస్తూనే ఈవిషయంలో ప్రభుత్వం అత్యుత్సాహంతో నిర్ణయాలు తీసుకోరాదని ప్రతిపక్షాలు సూచించాయి. ఆచితూచి జాగ్రత్తగా ముందడుగు వేయడం మంచిదని సలహా ఇచ్చాయి. అమెరికా ప్రకటించిన యుద్ధం నేరుగా ఉపఖండంపై ప్రభావం చూపే అవకాశం వున్నవిషయం దృష్టిలో వుంచుకోవల్సిన అవసరం వున్నదనివిపక్షనేతలు అభిప్రాయపడ్డారు.ప్రభుత్వం తీసుకుని నిర్ణయాల ప్రభావం దేశంలో కూడా ఎలాంటి బేధాభిప్రాయాలకు తావు లేకుండా వుండాలని వారు అన్నారు. జాతీయ ప్రయోజనాలు, దేశ ఆర్ధిక క్షేమాన్ని దృష్టిలో వుంచుకోవాలని వారు అన్నారు. అమెరికా పరిణామాల దరిమిలా ఆర్ధిక రంగం ఎదుర్కోనున్న సంక్షోభాన్ని వివరించి కొన్ని కఠిన నిర్ణయాలు తథ్యమని ప్రధాని అఖిల పక్ష సమావేశానికి వివరించారు.

ఈ నెల 18వ తేదీన టెర్రరిస్టులకు వ్యతిరేకంగా జాతీయ సంఘీభావ దినంగా పాటించాలని సమావేశం నిర్ణయించింది. భారత విమానాశ్రాయలను ఉపయోగించుకుంటామని అమెరికా తమను కోరలేదని రక్షణ మంత్రి జస్వంత్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలుః

  • అమెరికా దాడుల కేసులో తొలి అరెస్టు
  • గుట్టలు గుట్టలుగా శవాలు
  • 50 మందిని గుర్తించిన ఎఫ్‌బిఐ
  • సమాచారం కోసం ఆంధ్రుల ఆరాటం
  • ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
  • ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
  • లాడన్‌పైనే అమెరికా అనుమానం
  • దాడులతోసంబంధం లేదన్న లాడెన్‌
  • మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
  • కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
  • దాడులుమేమే చేశాం: లష్కర్‌
  • అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
  • ముందేహెచ్చరించిన లాడెన్‌
  • గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్‌
  • ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్‌
  • కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్‌
  • అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
  • అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
  • భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X