• search

కరవు సాయంలో సర్కారు వైఫల్యం

Posted By:
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    హైదరాబాద్‌ః కరవు సాయం పనుల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విపక్షాలు శనివారం నాడు అసెంబ్లీలో ఆరోపించాయి. శనివారం రెండో రోజు సభలో రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై సుమారు ఏడు గంటల పాటు చర్చ జరిగింది.

    ఈ సందర్భంగా ప్రసంగించిన మిత్రపక్షం బిజెపి, కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా దయ్యబట్టారు. కరవు సాయ పనుల నిర్వహణలో ప్రభుత్వంవిఫలమైందని వారు విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న కరవుకు కారణం తెలుగుదేశం పాలన అని తాము అనడం లేదని కాంగ్రెస్‌ సభ్యుడు మైసూరరెడ్డి అన్నారు.

    ప్రకృతి వైపరీత్యాంగానే తాము కరవును గుర్తిస్తున్నామని అయితే దీనిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం వైఫల్యపైనే తమవిమర్శలని ఆయన స్పష్టం చేశారు. కేంద్రానికి దగ్గరి మిత్రుడైన చంద్రబాబు రాష్ట్రాన్ని కరవు బారి నుంచి ఆదుకోవడానిక సాయం రాబట్టడంలోవిఫలం కావడమేమిటని ఆయన ప్రశ్నించారు.

    రాష్ట్రంలో కేంద్రబృందం పర్యటన దండగమారి వ్యవహారంగామిగిలిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం నిధులను ప్రచారం కోసం దుబారా చేస్తున్నదని కాంగ్రెస్‌ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై సభలో కొంతసేపు గొడవ జరిగింది. కరవు వాతబడిన ప్రజలను ఆదుకోవల్సిన ప్రభుత్వంఅసలే అంతంత మాత్రంగా వున్న నిధులను ప్రచారంపై వెచ్చిస్తున్నదని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి.

    స్పాట్‌ లైట్‌ఃఆంధ్ర అసెంబ్లీ స్పెషల్‌

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more