వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ షాపింగ్‌ లో పన్ను రాయితీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః హైదరాబాద్‌లో నెలరోజుల పాటు నిర్వహించనున్న గ్రేట్‌మాల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌లో జరిగే క్రయవిక్రయాకు అమ్మకం పన్ను రాయితీని ఇవ్వనున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.

శనివారం నాడు నెక్లెస్‌ రోడ్‌లోని హుడా గ్రౌండ్స్‌లోఫెస్టివల్‌ మస్కట్‌ నెమలిని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ షాపింగ్‌ఫెస్టివల్‌ను భారీఎత్తున నిర్వహిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు. ఈఫెస్టివల్‌ వల్ల రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కూడా అవకాశం వున్నదని ఆయన చెప్పారు.

పెరల్‌ సిటీ ఆఫ్‌ ఇండియాగాపేరున్న హైదరాబాద్‌లో చార్మినార్‌, గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలతో పాటు రామోజీ ఫిల్మ్‌ సిటీ, హుస్సెన్‌సాగర్‌, ఎన్‌టిఆర్‌ గార్డెన్‌ మొదలైన ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వున్నాయని ఆయన చెప్పారు. దుబాయి షాపింగ్‌ఫెస్టివల్‌ తరహాలోనే హైదరాబాద్‌ షాపింగ్‌ఫెస్టివల్‌ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. పదిహేను దేశాలు ఈఫెస్టివల్‌లో పాల్గొంటున్నట్టుగా ఆయన వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X