• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిక్కు యువకుని దారుణ హత్య

By Staff
|

ఫీనిక్స్‌(ఆరిజొనా)ః అమెరికాలోని ఆరిజొనా రాష్ట్రం ఫీనిక్స్‌ పట్టణంలో ఒక సిక్కు యువకున్ని గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు.

గ్యాస్‌స్టేషన్‌ పక్కనే వున్న పార్కింగ్‌సెంటర్‌ వద్ద వున్న బల్‌బీర్‌ సింగ్‌ సోథీ అనే యువకున్ని గుర్తుతెలియనివ్యక్తి ఒకరు సమీపం నుంచి తుపాకీతో కాల్చి చంపినట్టుగా పోలీసులు తెలిపారు. న్యూయార్క్‌లో టెర్రరిస్టుల బీభత్సం తర్వాత నుంచి సిక్కులపై పలు ప్రాంతాల్లో దాడులు జరిగాయి.బిన్‌లాడన్‌ పై తీవ్రమైన ఆగ్రహంతో రగిలిపోతున్న సగటు అమెరికన్లు సిక్కులను కూడా అరబ్‌జాతీయులుగా భావించి ఈ దాడులు జరుపుతున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

బిన్‌లాడన్‌ ధరించినట్టుగానే సిక్కులు కూడా టర్బన్‌ ధరించడం, గడ్డం వుండటం ఈ పరిణామాలకు కారణంగా భావిస్తున్నారు. ఈ సంఘటనతో అమెరికాలోని సిక్కుల్లో తీవ్ర భయాందోళనలు వ్యాపించాయి. తమకుబిన్‌లాడెన్‌కు ఏ సంబంధం లేదని తాము అరబ్బులము కాదని తాము భారతీయులైన సిక్కులమని పలువురు సిక్కు ప్రతినిధులు టివి చానెల్స్‌లో వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు.

వాషింగ్టన్‌, న్యూయార్క్‌ పట్టణాల్లో సిక్కులపైపెద్దఎత్తునే దాడులు జరినట్టుగా వార్తలు వచ్చాయి.ఇదిలా వుండగా లండన్‌, ఆస్ట్రేలియాతో పలు యూరప్‌ దేశాల్లో కూడాఅరబ్బులు, ఆసియన్లపై దాడులు జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. కొన్ని చోట్ల మసీదులపై దాడులు జరిగాయని తెలిసింది. బురఖాలు ధరించిన మహిళలను వేధిస్తున్నట్టుగా వార్తలుఅందాయి. సిక్కులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత హైకమిషనర్‌ కూడా స్థానిక పోలీసులతో మాట్లాడి గురుద్వారాలకు రక్షణ కల్పించాల్సిందిగాకోరారు.

సంబంధిత వార్తలుః

  • అమెరికా దాడుల కేసులో తొలి అరెస్టు
  • గుట్టలు గుట్టలుగా శవాలు
  • 50 మందిని గుర్తించిన ఎఫ్‌బిఐ
  • సమాచారం కోసం ఆంధ్రుల ఆరాటం
  • ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
  • ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
  • లాడన్‌పైనే అమెరికా అనుమానం
  • దాడులతోసంబంధం లేదన్న లాడెన్‌
  • మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
  • కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
  • దాడులుమేమే చేశాం: లష్కర్‌
  • అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
  • ముందేహెచ్చరించిన లాడెన్‌
  • గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్‌
  • ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్‌
  • కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్‌
  • అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
  • అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
  • భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X