• search

అఎn్గాన్‌కు మూడు రోజుల గడువు

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    కాబూల్‌ః పాకిస్తాన్‌ ప్రభుత్వం పంపిన అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందం సోమవారం నాడు కాందహార్‌ చేరుకుని తాలిబన్‌ ప్రభుత్వ నేతలతో మంతనాలు జరిపింది. ఒసామాబిన్‌ లాడన్‌ను అమెరికాకు అప్పగించడానికి ఈ బృందం తాలిబన్‌ నేతలకు మూడు రోజుల గడువు ఇచ్చినట్టుగా తెలిసింది.

    పాకిస్తాన్‌ ఇంటర్‌సర్వీసెస్‌ ఇంటలీజెన్స్‌ చీఫ్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ మహమూద్‌ అహమ్మద్‌ నాయకత్వంలో మొత్తం ఆరుగురు సభ్యులున్న అత్యున్నత స్థాయి పాక్‌ బృందం తాలిబన్‌ నేతలతో కాందహార్‌లో చర్చలు జరిపింది. ముందుగాఅఎn్గాన్‌ విదేశాంగ మంత్రి వకీల్‌ అహ్మద్‌ ముత్తావకీల్‌ను పాకిస్తాన్‌బృందం కలుసుకుని చర్చలు జరిపింది.

    వకీల్‌తో పాక్‌బృందం సమావేశమైన ప్రాంతంలోనే లాడన్‌కు కూడా సొంత ఇల్లువున్నట్టుగా తెలిసింది. వకీల్‌తో సమావేశమైన తర్వాత పాకిస్తాన్‌ ప్రతినిధులు తాలిబన్ల అగ్రనేత ముల్లా మహమ్మద్‌ ఒమర్‌ను కలుసుకున్నారు. ఒమర్‌తో వారు సుమారు మూడు గంటలపాటు చర్చలు జరిపారు. ప్రపంచదేశాలకు లాడెన్‌ను అప్పగించడానికిఅఎn్గానిస్తాన్‌కు పాక్‌ ప్రతినిధులు మూడు రోజుల సమయం ఇచ్చినట్టుగా తెలిసింది.

    అమెరికాకు అప్పగించడం యిష్టం లేకపోతే లాడెన్‌ను కనీసం మధ్యవర్తి దేశానికైనాఅప్పగించాలని పాకిస్తాన్‌ ప్రతినిధులు సూచించినట్టుగా తెలిసింది. ఒక్క వ్యక్తికోసం పట్టుబట్టి లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెట్టడం సరికాదని తాలిబన్‌ నేతలకు పాక్‌ ప్రతినిధులువివరించినట్టుగా తెలిసింది. ఇదిలా వుండగా పాకిస్తాన్‌ డిమాండ్‌పై ముస్లీం మత నేతలు, ఇస్లాం పండితులతో ముల్లా ఒమర్‌ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పాకిస్తాన్‌ డిమాండ్‌కు తలవొగ్గని పక్షంలో, అమెరికాకు వ్యతిరేకంగాజీహాద్‌ ప్రారంభించాల్సిందిగా
    ప్రపంచవ్యాప్తంగా వున్న ముస్లీంలకు ముల్లా ఒమర్‌ పిలుపునిచ్చే అవకాశం వున్నదనిఅంటున్నారు. పాకిస్తాన్‌ ప్రతినిధి బృందంలో పలువురుసీనియర్‌ సైనికాధికారులు, దౌత్‌యవేత్తలు వున్నారు.అఎn్గాన్‌లో గతంలో పాక్‌ రాయబారిగా పనిచేసిన అజిజ్‌ఖాన్‌ కూడా బృందంలో వున్నారు.

    • పలుదేశాల్లో నిందితులు: బుష్‌
    • బంగ్లా సహకారం కోరిన అమెరికా
    • పాక్‌ను వదిలేందుకు దౌత్యవేత్తల పరుగులు
    • సిక్కులపై బ్రిటన్‌లోనూ దాడులు

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more