• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాకు యాసర్‌అరాఫత్‌ దన్ను

By Staff
|

న్యూయార్క్‌ః పాలస్తీనా విమోచన సంస్థ నేత యాసర్‌ అరాఫత్‌ టెర్రరిజం పై పోరులో పిఎల్‌ఒ అమెరికాకు దన్నుగా వుంటుందని ప్రకటించారు. టెర్రరిస్టుల దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు.

టెర్రరిజంపై అమెరికా ఎక్కుపెట్టిన చర్యను దృష్టిలో వుంచుకుని ఇజ్రాయెల్‌తో యుద్ధాన్ని తాము నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆత్మరక్షణ కోసం కూడా తమ దళాలు ఇజ్రాయెల్‌పై తుపాకీ ఎక్కుపెట్టరని ఆయన ప్రకటించారు. ఆయన ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్‌ కూడా పాలస్తినాతో కాల్పులవిరమణను ప్రకటించింది.

అమెరికాలో టెర్రరిస్టుల మారణకాండను సమర్ధిస్తున్న ఉగ్రవాదసంస్థలు, మత సంస్థలు పశ్చిమాసియా సమస్యను ప్రధానంగా ఎత్తిచూపుతున్న నేపథ్యంలో ఈ పరిణామానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

ఒసామాబిన్‌లాడెన్‌ అప్పగింతకోసంఅఎn్గానిస్తాన్‌పై వత్తిడి కోసం ప్రయత్నిస్తున్న అమెరికా ఈవిషయంలో అరబ్బు దేశాల మద్దతు సంపాదించడానికి ఈ పరిణామం కీలకం కాగలదని భావిస్తున్నారు. మరో వైపు టెర్రరిజంపై పోరులో అమెరికాతో బేషరతుగా సహకరించడానికి అన్ని నాటో దేశాలుఅంగీకరించలేదు.

జాగ్రత్తగా అడుగువేయాలని జర్మనీ సూచించగాబ్రిటన్‌ మాత్రం అమెరికాతోనే తాము వున్నట్టుాగ ప్రకటించింది. ఇటలీ, గ్రీస్‌ మాత్రంసైన్యాన్ని పంపడానికి విముఖత వ్యక్తం చేశాయి. కేవలం టార్గెట్‌పైనే దాడి చేయాలి తప్ప తొందరపడి అమాయకులను దాడులకు బలిచేయరాదని చైనా సూచించింది. భద్రతామండలి అనుమతి లేనిదే అమెరికా ముందుకు కదలరాదని కూడా చైనా స్పష్టం చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X