• search

అమెరికా అతిపెద్ద టెర్రరిస్టు రాజ్యం

Posted By:
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    న్యూఢిల్లీః న్యూయార్క్‌ దాడులకు ప్రతీకారంగా అమెరికా అఎn్గానిస్తాన్‌పై దాడి చేస్తే భారతదేశంలోని ముస్లీంలు వీధుల్లోకి వస్తారని జమా మసీదు ఇమాం, సయ్యద్‌ అహమద్‌ బుఖారీ హెచ్చరించారు. టెర్రరిస్టుల పట్ల భారతీయ ముస్లీంలు సానుభూతితో లేరని ఆయన స్పష్టం చేశారు.

    న్యూయార్క్‌ దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. టెర్రరిస్టులపై దాడి ప్రకటించినట్టుగా చెబుతున్న అమెరికానే అనేక సందర్భాల్లో తన ప్రయోజనాల కోసం టెర్రరిజాన్ని ప్రమోట్‌ చేసిందని ఆయన చెప్పారు. న్యూయార్క్‌ దాడుల్లో ఒసామాబిన్‌ లాడెన్‌ హస్తం వున్నదనడానికి అమెరికా వద్ద ఆధారాలేమీ లేవని ఆయన అన్నారు.అఎn్గాన్‌పై అమెరికా దాడి జరిపితే భారత ముస్లీంలు చేతులు ముడుచుకుని కూచునే సమస్యే లేదని ఆయన చెప్పారు.

    దేశవ్యాప్తంగా అమెరికాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరపనున్నట్టుగా ఆయన వెల్లడించారు. ప్రపంచంలో ఇవ్వాళ్లఅందరికన్నా అమెరికా అతి పెద్ద టెర్రరిస్టు రాజ్యమని ఆయన అన్నారు. అమెరికా పాకిస్తాన్‌లో తన బలగాలను దింపితే అది భారత్‌కు కూడా ప్రమాదమేనని ఆయన అన్నారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా భారత్‌ చేస్తున్న పోరాటానికి అమెరికా ఒక్కసారిగా కూడా మద్దతు నివ్వలేదని బుఖారీ అన్నారు. భారత్‌ను బలహీనపర్చడమే అమెరికా లక్ష్యమని ఆయన ఆరోపించారు.

    తాలిబన్లకు ఆయుధాలు సమకూర్చిన పాపం అమెరికాదేనని ఆయన చెప్పారు. మధ్యప్రాచ్యం,ఇరాక్‌, సూడాన్‌ల్లో ఇప్పుడు అఎn్గానిస్తాన్‌లో అమెరికా చేపట్టిన చర్యలు ఆదేశానికి ఇస్లాం పట్ల వున్న వ్యతిరేకతకు నిదర్శనమని బుఖారీ అన్నారు.వియత్నాంలో అమెరికా సాగించిన నరమేధం మాటేమిటని ఆయన ప్రశ్నించారు. పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెల్‌ దళాలు సృష్టిస్తున్న బీభత్సం గురించి ఎందుకు ప్రస్తావించరని ఆయన అన్నారు. ఇరాక్‌లో వేలాది మందిని అమెరికా బలిగొన్నవిషయం మర్చిపోతే ఎలా అని బుఖారీ ప్రశ్నించారు. టెర్రరిస్టులను ప్రోత్సహిస్తునే అదే చేత్తో టెర్రిరిస్టుల వల్ల దెబ్బతింటున్న దేశాల పట్ల సానుభూతి ప్రకటించడం అమెరికాకే చెల్లిందని ఆయనవిమర్శించారు.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more