వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో విమానం కూల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

కాబూల్‌ః అమెరికాకు చెందిన మరో గూఢచారి విమానాన్ని కూడా కూల్చివేసినట్టుగా అఎn్గానిస్తాన్‌ ప్రకటించింది. రెండు రోజుల క్రితమే పైలెట్‌ రహిత అమెరికా విమానాన్ని తాలిబన్లు కూల్చివేసిన విషయం విదితమే. సోమవారం నాడు మరో విమానాన్ని కూల్చివేసినట్టుగా వారు ప్రకటించారు.

అయితే అమెరికా మాత్రం దీనిని ధృవీకరించలేదు. యుద్ధసన్నాహాలు మాత్రం ముమ్మరం చేసింది. లాడెన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు వున్నాయని వాటిని మిత్రరాజ్యాలకు చూపిస్తామని కూడా అమెరికా ప్రకటించింది. కొన్ని దేశాలుమినహా ప్రస్తుతం అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా మెజార్టీ దేశాలు మద్దతు ప్రకటించడంతో దాడులకు అమెరికాశ్రీకారం చుట్టనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.బ్రిటన్‌ కూడా పెద్ద ఎత్తున యుద్ధనౌకలను,విమానాలకు అమెరికాకు మద్దతుగా తరలించింది. అమెరికా చిన్నస్థాయిలో ఇప్పటికే దాడులు ప్రారంభించిందని కూడా వార్తలు వస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X