వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడెన్‌ మాయం

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ఃఅమెరికాపై దాడులకు కారకునిగా భావిస్తున్న బిన్‌లాడెన్‌ అఎn్గానిస్తాన్‌ నుంచి మాయమైనట్టుగా తాలిబన్‌ ప్రభుత్వం ప్రకటించింది. లాడెన్‌ జాడ తెలియడం లేదని ఆదివారం రాత్రి అధికార ప్రకటన విడుదల చేశారు. అయితే తాలిబన్ల ప్రకటనను
తాము గుడ్డిగా నమ్మేది లేదని అమెరికా చెప్పింది.

లాడెన్‌ను దేశం విడిచి వెళ్లాల్సిందిగా కోరాలని ఉలేమాల సదస్సు చేసిన సిఫారసు మేరకు ముల్లా ఉమర్‌ ఒక ఫత్వా జారీ చేశారని ఫత్వా గురించి తెలియజేయడానికి వెళ్లిన తమకు ఆయన జాడ దొరకలేదని తాలిబన్‌ ప్రతినిధులు వెల్లడించారు. ఆయన ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని దొరికితే ఫత్వా గురించి ఆయనకు తెలియజేస్తామని వారుఅంటున్నారు. ఇదిలా వుండగా తాలిబన్ల సుప్రీం కమాండర్‌ ముల్లా ఉమర్‌ ఇప్పటికే ఒకసారి లాడెన్‌ను రహస్యంగా సుదీర్ఘ సమావేశం జరిపారని కూడావినవస్తున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X