వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఎn్ఘాన్‌ మొండిపట్టు- బిగుస్తున్న ఉచ్చు

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌:అఎn్ఘానిస్తాన్‌లోని తన దౌత్య సిబ్బందిని పాకిస్థాన్‌ వెనక్కి పిలిపించింది. భద్రతా కారణాల దృష్ట్యానే తమ సిబ్బందిని వెనక్కి పిలిపిస్తున్నట్లు పాకిస్థాన్‌ప్రకటించింది.

ఉన్నత స్థాయి అమెరికా అధికారుల బృందం ఇస్లామాబాద్‌ చేరుకున్న నేపథ్యంలో పాకిస్థాన్‌ ఈ చర్యకు పూనుకుంది.
ఇదిలా వుంటే, తాలిబాన్‌ కాందహార్‌లోని ఐక్య రాజ్య సమితి కార్యాలయాలనుస్వాధీనం చేసుకుంది. అఫ్ఘనిస్థాన్‌లోని టెర్రిరిస్టు స్థావరాలపై అమెరికాపెద్ద యెత్తున సైనిక చర్యకు పూనుకోవడానికి సిద్ధపడడంతో అసాధారణ పరిస్థితి నెలకొన్నదని, ఈ స్థితిలో కాబూల్‌లోని, ఇతర నగరాల్లోని తమ దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించిందని పాకిస్థాన్‌ అన్నది.

అమెరికా విదేశాంగ శాఖకు, పెంటగాన్‌కు చెందిన ఉన్నత స్థాయి అధికారులు మంగళవారం పాకిస్థాన్‌కు చేరుకున్నారు.అఎn్ఘానిస్థాన్‌ సరిహద్దుల్లో వున్న ఖుయెట్టా,పెషావర్‌ నగరాల్లో పరిస్థిని అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్‌సైనిక, ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.

ఈ చర్చల వివరాలను గోప్యంగా వుంచుతున్నారు. చర్చలు సుదీర్ఘంగా సాగవచ్చునని భావిస్తున్నారు.సైనిక వసతులను వీరు తనిఖీ చేసి అవి అమెరికాసైనిక బలగాల మోహరింపునకు అనువుగా వున్నాయా, లేవా అనేవిషయాన్ని తేల్చుకుంటారు.
ఇదిలా వుంటే, అఎn్ఘానిస్తాన్‌ సరిహద్దుల్లో వున్న తజకిస్థాన్‌లో, ఉజ్బెకిస్థాన్‌లో అమెరికా తనసైన్యాన్ని మోహరిస్తోంది. బ్రిటిష్‌ సైనిక బలగాలు సూయజ్‌ కాలువ వరకు చేరుకున్నాయి.బ్రిటిష్‌ మంత్రి ఒకరు మంగళవారం టెహ్రాన్‌ చేరుకున్నారు. ఆయన ఇరాన్‌ అధికారులతో చర్చలు జరిపారు.

తీవ్రవాదాన్ని అంతం చేయాలనుకుంటే అమెరికా గల్ఫ్‌ నుంచి తనసైన్యాన్ని ఉపసంహరించుకోవాలని, పాలస్తీనా సమస్యను పరిష్కరించాలని తాలిబాన్‌ నేత ముల్లా ఒమర్‌ అన్నారు. తననో, లాడెన్‌నో చంపినంత మాత్రాన అమెరికాసంక్షోభం నుంచి బయట లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X