• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దాడి చేస్తేఊరుకోం: ఆల్‌-ఖైదా

By Staff
|

ఇస్లామాబాద్‌: తనపై గానీ,అఎn్ఘానిస్తాన్‌పై గానీ దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌కు చెందిన ఆల్‌- ఖైదా సంస్థ అమెరికాను హెచ్చరించింది. ఈ మేరకు ఆల్‌ ఖైదా ఛీఫ్‌మిలటరీ కమాండర్‌ నసీర్‌ అహ్మద్‌ ముజాహీద్‌పేర ఇస్లామాబాద్‌లోని వార్తా పత్రికలకు ఒక ప్రకటనఫాక్స్‌ ద్వారా అందింది. అమెరికన్లు, యూదులు ఎక్కుడున్నా వారిపై దాడులు చేస్తామని ఆ ప్రకటనలో హెచ్చరించారు. మమ్మల్ని మేము రక్షించుకోగలం. పవిత్ర యుద్ధ యోధులు సిద్ధంగా వున్నారు అని నసీర్‌ అహ్మద్‌ ముజాహీద్‌ అన్నారు. ముస్లింలు ఎక్కడున్నా వారందరూ పవిత్ర యద్ధానికి సిద్ధం కావాలని, దైవ సంకల్పం వల్ల ఇస్లాం గెల్చి తీరుతుందని ఆయన అన్నారు.

ఇదిలా వుంటే, న్యూయార్క్‌, వాషింగ్టన్‌ దాడుల్లో ఒసామాబిన్‌ లాడెన్‌కు పాత్ర వుందని రుజువు చేసే ఆధారాలను అమెరికా రక్షణ శాఖ ప్రతినిధులు పాకిస్థాన్‌ అధికారులకు చూపుతున్నారు.

పాకిస్థాన్‌ అధికారులతో అమెరికా ప్రతినిధి బృందం సోమవారం ప్రారంభించిన చర్చలు మంగళవారం కూడా కొనసాగుతున్నాయి. ఒసామాబిన్‌ లాడెన్‌ను, టెర్రరిస్టులను పట్టుకునేందుకు ఉమ్మడి వ్యూహాన్ని తయారు చేసే పని నిమగ్నమై వున్నట్లు పాకిస్థాన్‌ అధికార వర్గాలు చెబుతున్నాయి.

దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ పాకిస్థాన్‌ ప్రభుత్వం అమెరికాకు పూర్తి సహకారంఅందించేందుకు సిద్ధపడింది. మరో అమెరికా ఉన్నత స్థాయి అధికారబృందం ఇస్లామాబాద్‌కు రావచ్చునని తెలుస్తోంది. అయితే, ఈ బృందం ఎప్పుడువచ్చేది చెప్పలేకపోతున్నారు.


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X