వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవహక్కులు పదిలం

By Staff
|
Google Oneindia TeluguNews

లండన్‌ః న్యూయార్క్‌లో టెర్రరిస్టులు సృష్టించిన మారణకాండ దరిమిలా ప్రతీకార దాడులకు సిద్ధమైన అమెరికా ప్రతీకార దాడుల సందర్భంగా సాధారణ ప్రజల జీవితాలు దెబ్బతినకుండా అంతర్జాతీయ పౌరహక్కుల ప్రమాణాలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ డిమాండ్‌ చేసింది.

అమెరికాపై టెర్రరిస్టుల దాడిని ఖండిస్తునే ఆమ్నెస్టీ ఇంటర్‌నేషనల్‌సెక్రటరీ జనరల్‌ ఇర్నే ఖాన్‌, ప్రతీకార ధోరణితో కాకుండా న్యాయం సాధించాలనే లక్ష్యంతో అమెరికా ముందుకు సాగాలని సూచించారు. ఈ క్రమంలో మానవహక్కులకు ఎటువంటి భంగం కలగకుండా చూడాలని ఆమెకోరారు. ఆగ్రహం ప్రతీకార అన్యాయానికి తోవతీయకూడదని ఆమె సూచించారు. దాడులకుకారకులైన వారిని చట్టం పరిథిలో బంధించి శిక్షించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆమెకోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X