వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

29న కర్నూలులో కోట్ల అంత్యక్రియలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి కోట్లవిజయభాస్కర్‌ రెడ్డి భౌతిక కాయానికి శనివారం మధ్యాహ్నం కర్నూలు జిల్లాలోని హంద్రీ నదీ తీరంలో అంత్యక్రియలు జరుగుతాయి. గురువారం మరణించిన కోట్లవిజయభాస్కర్‌ రెడ్డి భౌతిక కాయాన్ని గురువారం మధ్యాహ్నం బంజారాహల్స్‌లోని ఆయన ఇంటికి తరలించారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు కార్యకర్తల, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయం గాంధీభవన్‌ వద్దవుంచుతారు. అనంతరం కర్నూలుకు తరలిస్తారు. శనివారంనాడు కర్నూలు జిల్లాలోసెలవు ప్రకటించారు.

కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి మృతికి రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. కోట్ల మృతికి దేశానికి, రాష్ట్రానికి తీరని లోటు అని ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయితో సహా అన్ని పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు.
కోట్ల మృతికి రాష్ట్రపతి కె.ఆర్‌. నారాయణన్‌, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తమ తీవ్ర సంతాపం తెలియజేశారు. కోట్ల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

గవర్నర్‌ సి. రంగరాజన్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నాయకుడు డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి, తదితరులు కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి మృతి దేశానికి, రాష్ట్రానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి దేశానికి, రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారని ఆయన కొనియాడారు.

కోట్ల మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు అని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు అన్నారు. విజయభాస్కర్‌ రెడ్డి మృతి దేశానికి, రాష్ట్రానికి, మరీ ముఖ్యంగా తమకు తీరని నష్టమని సిఎల్‌పి నాయకుడు డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి పరిపాలనా దక్షుడిగా, గ్రామాభ్యున్నతికి పాటు పడిన నేతగా వినుతికెక్కారని నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి అన్నారు.

కోట్ల మృతికి పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు తమ సంతాపం ప్రకటించారు. కోట్ల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానూభూతిని తెలియజేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X