• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అఎn్గాన్‌కు మరోసారి పాక్‌ బృందం

By Staff
|

ఇస్లామాబాద్‌ః ఒసామా బిన్‌ లాడెన్‌ను అమెరికాకు అప్పగించాల్సిందిగా అఎn్గాన్‌లోని తాలిబాన్‌ ప్రభుత్వ నేతలకు నచ్చజెప్పడానికి వీలుగా పాకిస్తాన్‌ ప్రభుత్వం తాజాగా మరో దౌత్య బృందాన్ని కాబూల్‌కు పంపించింది. సమస్యను ఎలాగైనా సామరస్యంగా పరిష్కరించుకుని అఎn్గాన్‌లో తన అనుకూల తాలిబన్‌ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని అదే సమయంలో అమెరికాతో మైత్రి మరింత గట్టి పర్చుకోవాలని ముషారఫ్‌ కృతనిశ్చయంతో వున్నారు. ఈ సారి పాకిస్తాన్‌ పంపిన బృందంలో తాలిబన్‌ అనుకూల నేతలు వున్నట్టుగా చెబుతున్నారు.

జమాత్‌-ఎ- ఇస్లామి నేత క్వాజీ హుస్సెన్‌, జమాత్‌-ఇ-ఉలేమా నేత సమ్మి ఉల్‌ హక్‌, జమాత్‌-ఇ- ఇస్లామ్‌ నేత మౌలానా ఫజ్లూర్‌ రెహ్మాన్‌ ఈ బృందంలోవున్నారు. ఈ బృందం సెప్టెంబర్‌ 28న తాలిబన్‌ నేత ముల్లా ఒమర్‌ను కలుసుకునే అవకాశం వుంది. అఎn్గాన్‌పై అమెరికా దాడిని నివారించడమే ప్రధాన లక్ష్యంగా పాకిస్తాన్‌ పావులు కదుపుతున్నది. అమెరికాకు పాకిస్తాన్‌ మద్దుతు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మతాధిపతులనే అఎn్గాన్‌తో దౌత్యానికి ఆయన పాకిస్తాన్‌ నేత ముషారఫ్‌ ప్రయోగించారు.

ఇదిలా వుండగాఅఎn్గానిస్తాన్‌తో పాకిస్తాన్‌ అధికారిక సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయని పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి ప్రకటించారు.ఇదిలా వుండగా ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో వున్న అమెరికా ప్రతినిధుల బృందానికి పాకిస్తాన్‌సైనిక పాలకులకు టెర్రరిజాన్ని ఎదుర్కునే విషయంలో ఏకాభిప్రాయం కుదిరిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ కొత్త దౌత్యం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఇదిలా వుండగా ఒసామాబిన్‌ లాడెన్‌ కోసం గాలింపు జరుపుతున్న అంతర్జాతీయ ఇంటలీజెన్స్‌ బృందంలో పాకిస్తాన్‌ కూడా చేరాలని నిర్ణయించింది. అమెరికా ప్రతినిధులతో జరుగుతున్న చర్చల్లో ఈ మేరకు పాకిస్తాన్‌ నిర్ణయం తీసుకున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X