• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రచారం

By Staff
|

న్యూఢిల్లీః టెర్రరిజానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున జాతీయ స్థాయిలో ప్రచారం చేపట్టాలని ప్రధాని వాజ్‌పేయి పిలుపునిచ్చారు. గురువారం నాడు ఆయన అఖిలపక్ష సమావేశంలో ప్రసంగించారు. అఎn్గానిస్తాన్‌కు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన పోరాటంలో అమెరికాకు సైనిక పరంగా మద్దతు ఇస్తామని భారత్‌ హామీ ఇవ్వలేదని ఆయన చెప్పారు.

భారత వైమానిక స్థావరాలకోసం అమెరికా అడగలేదని తాము ఇస్తామని చెప్పలేదని ఆయనవివరించారు. ఈ సమావేశానికి బిజెపి, తెలుగుదేశం, బిఎస్‌పి, సమాజ్‌వాది పార్టీ, ఆర్‌జెడిహాజరయ్యాయి. టెర్రరిజానికి వ్యతిరేకంగా అఖిల పక్ష ప్రచారం జాతీయ స్థాయిలో సాగాలని ఆయనకోరారు. టెర్రరిజంపై పోరును ఇస్లాంపై పోరుగా తప్పుగాఅర్ధం చేసుకోరాదని ఆయన అన్నారు. టెర్రరిజంపై పోరును ఇస్లాంపై పోరుగా వర్ణించేవారి పట్ల అప్రమత్తంగా వుండాలని ఆయనకోరారు.

మత సామరస్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.సమావేశం వివరాలను ప్రమోద్‌ మహాజన్‌ పాత్రికేయులకువివరించారు. టెర్రరిజంపై పోరు విషయంలో అమెరికాకు మద్దతు ఇస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూనే ఈవిషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కాంగ్రెస్‌, వామపక్షాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X