• search

సిమిపై నిషేధం- కాల్పుల్లో ముగ్గురు మృతి

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    న్యూఢిల్లీ, లక్నో: పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్‌సర్వీస్‌ ఇంటలిజెన్స్‌ (ఐఎస్‌ఐ)తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో స్టూడెంట్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా(సిమి)ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. తమ రాష్ట్రాల్లో సిమి హింసకు పాల్పడినట్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు డిమాండ్‌ చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిషేధం విధించింది.

    సిమి ముఖ్య నాయకులు కొందరు దేశ సమగ్రతకు భంగం వాటిల్లే ప్రకటనలు చేసినట్లు, లాడెన్‌ అనుకూల ప్రకటనలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

    సిమి ముఖ్యనాయకులఅరెస్టు నిరసనగా లక్నోలో ఆందోళన పెల్లుబుకింది. హింసకు దిగిన ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.

    లక్నోలోని చౌక్‌, వజీర్‌గంజ్‌, సాదత్‌గంజ్‌, బజార్‌ ఖాలా ప్రాంతాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించినట్లు ప్రిన్సిపల్‌సెక్రటరీ (హోం) నరేష్‌ దయాళ్‌ చెప్పారు. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులు సిమి ఆఫీసు బియరర్లనుఅరెస్టు చేయడంతో సమస్య ఉత్పతన్నమైంది. ప్రజలుపెద్ద యెత్తున వీధుల్లోకి వచ్చి షాపులను బలవంతంగా మూసేయిస్తూ, హింసకు దిగారని, బందోబస్తులో వున్న పోలీసులతో ఘర్షణ పడ్డారని అదనపు డైరెక్టర్‌ జనరల్‌ఎ.కె. మిత్రా చెప్పారు. పోలీసులు 67 మంది సిమి నాయకులనుఅరెస్టు చేశారు. ఇందులో 63 మంది ఆఫీసు బియరర్లు.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more