వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాబూల్‌ లో యుద్ధఘోష

By Staff
|
Google Oneindia TeluguNews

కాబూల్‌ః అమెరికా ఏ క్షణంలోఅయినా దాడి చేయవచ్చుననే ఆలోచనల మధ్య ఆఫ్ఘన్‌ శతఘ్నులు శుక్రవారం తమ శక్తి సామర్ధ్యాలను పరీక్షించుకున్నాయి. ఏ క్షణంలో అమెరికా దాడికి దిగినా ఎదుర్కొనేందుకువీలుగా ఆఫ్ఘన్‌ లు శుక్రవారం నాడు పరీక్షలు నిర్వహించారు. అయితే ఆఫ్ఘన్‌ కొండల నుంచి భీకరమైన శబ్దాలనువిన్న ఆఫ్ఘన్‌ ప్రజలు యుద్ధం వచ్చేసిందని భయపడ్డారు. ఒక్క ఉదుటున వీధుల్లోకి పరుగులు తీశారు.

అయితే ఆ శబ్దాలు శతఘ్నులు, ఇతర ఆయుధాలను పరీక్షించినందువల్ల వచ్చినవి మాత్రమేనని, యుద్ధ ప్రారంభం కాలేదని తెలుసుకున్న ఆఫ్గన్‌ ప్రజలు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. మరో రెండు వారాలు ఆగితే ఆఫ్గనిస్తాన్‌ లో ఎముకలుకొరికే చలి వుంటుందని, ఆ వాతావరణంలో తమపై దాడి చేయడం ఆ పైవాడి తరం కూడా కాదని ఆఫ్ఘన్‌మిలిటెంట్లు ధీమాతో వున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ కు వున్న అన్ని మార్గాలను మూసివేస్తూ వస్తున్న అమెరికా భవిష్యత్‌ వ్యూహం ఏమిటనేది వేచి చూడాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X