వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాధ్యులు అమెరికామిలిటెంట్లేః లాడెన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కరాచీః అమెరికాపై జరిగిన దాడిలో తన ప్రమేయం ఏ మాత్రం లేదని అయితే ఇస్లాం శత్రువులను తుదముట్టించడమే తన లక్ష్యమని ఒసామాబిన్‌ లాడెన్‌ ప్రకటించాడు. ఈ నెల 11న న్యూయార్క్‌,పెంటగాన్‌ ల పై దాడుల అనంతరం ఆ పేలుళ్ళతో తనకు సంబంధంలేదంటూ లాడెన్‌ ప్రకటించడం ఇది మూడోసారి. అమెరికాతో పాటు యావత్‌ ప్రపంచం కూడా ఈపేలుళ్ళకు లాడెనే బాధ్యుడని భావిస్తున్నవిషయం విదితమే. అయితే ఈ పేలుళ్ళకు తాను బాధ్యుడ్ని కాదని లాడెన్‌ చెప్పినట్లు పాకిస్తాన్‌ దినపత్రిక శుక్రవారం ప్రచురించింది.

తాలిబన్ల కొమ్ముకాసే ఈ పత్రిక ద్వారా లాడెన్‌ తన ప్రకటన ఇచ్చినట్లు భావిస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళల ప్రాణాలు తీసిన ఆ దాడికి నేను బాధ్యుడ్ని కాను.... అయితే ముస్లిం వ్యతిరేకులపై సమరం ఆగదు... ఒక వేళ నేను మరణించినా ఈ యుద్ధఆగే ప్రసక్తి లేదని లాడెన్‌ తేల్చి చెప్పినట్లు ఆ పత్రిక తెలిపింది. లాడెన్‌ ఇంటర్వ్యూగా ఆ పత్రికపేర్కొన్నప్పటికీ ఆయన మనసులోని మాటను బయటప్రపంచానికి చాటి చెప్పేందుకు లాడెన్‌ ఆ పత్రికను వేదికగా ఉపయోగించుకుందని భావిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయల్‌ వంటి ముస్లిం వ్యతిరేకులకు బుద్ధి చెప్పేందుకు అవసరమైతే నేను మరో జన్మఎత్తుతానని లాడెన్‌ ప్రకటించాడు.

అమెరికాలోని సాయుధ మిలిటెంట్‌ గ్రూపులే ఈ చర్యకు పాల్పడి వుండవచ్చని కూడా లాడెన్‌ వ్యాఖ్యానించినట్లు ఆ పత్రికపేర్కొన్నది. ఐదేళ్ళగా ఆఫ్ఘనిస్తాన్‌ అతిథిగా వున్న లాడెన్‌స్వభావాన్ని విశ్లేషించి చూస్తే అమెరికాపై ఒకవేళ అతనే దాడి చేస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా ఆవిషయాన్ని అంగీకరిస్తాడనే అనిపిస్తున్నది. అయితే అమెరికాపై దాడులతో నాకు సంబంధంలేదంటూస్వయంగా మూడు సార్లు చెప్పడం చూస్తే అసలు బాధ్యులు ఎవరనేఅంశంపై అమెరికా పునరాలోచన చేయాలా అనే అనుమానం కలుగుతుంది.

డబ్బుకేం కొదవలేదుః లాడెన్‌
బ్యాంక్‌ అకౌంట్లు ఫ్రీజ్‌ చేసినంత మాత్రాన అల్‌-ఖైదా కార్యకలాపాలు ఏ మాత్రం ఆగవని ఒసామాబిన్‌ లాడెన్‌ వ్యాఖ్యానించినట్లు పాకిస్తాన్‌ లోని ఓ ఉర్దూ పత్రికవెల్లడించింది. మాకేం నష్టం లేదు. ఆదారి మూసేస్తే మరో దారిలో మాకు నిధులు వస్తాయి అని లాడెన్‌ ఉమ్మత్‌ అనే ఉర్దూ పత్రికకు ఇచ్చినఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు. అల్లా దయవల్లు మాకు మూడు నాలుగు మార్గాల ద్వారానిధులు వస్తాయని లాడెన్‌ అన్నట్లు ఆ పత్రిక తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా వున్న లక్షలాది మంది యువకులు అల్‌ - ఖైదాను ఆదుకుంటారు.... సంపన్న ముస్లింలు అల్‌ ఖైదాను ఎన్నటికీవిస్మరించరని లాడెన్‌ ఆ ఇంటర్వ్యూలో విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా వుండగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా లాడెన్‌ సారధ్యం వహించే అల్‌ - ఖైదా కు సంబంధించిన బ్యాంక్‌అకౌంట్లను స్తంభింప చేసింది. అన్ని వైపులా ఉచ్చు బిగుసుకుంటున్నప్పటికీ లాడెన్‌ ఏ మాత్రం చలనం లేకుండా వుండడంవిశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X