• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బెయిల్‌ల తిరస్కృతి- 75 మందిఅరెస్టు

By Staff
|

న్యూఢిల్లీ: స్టూడెంట్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా(సిమి) నాయకులు, కార్యకర్తలు పెట్టుకున్న బెయిల్‌ దరఖాస్తులను ఢిల్లీ కోర్టు త్రోసి పుచ్చింది. సిమి జాతీయాధ్యక్షుడు సాహిద్‌ బదర్‌తో పాటు పలువురుపెట్టుకున్న బెయిల్‌ దరఖాస్తులను కోర్టు తిరస్కరించింది.

సిమి నిషేధానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి అరెస్టయిన బదర్‌,సైఫ్‌ నాచన్‌, మహ్మద్‌ ఖాలీద్‌, ఇర్ఫాన్‌ఖాన్‌లను రిమాండ్‌కు పంపుతూ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ వినోద్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. వారిని 14 రోజుల పాటు జ్యుడిషియల్‌ కస్టడీకిపంపారు.

గురువారం అర్థరాత్రి నుంచి సిమి కార్యాలయాలపై దేశ వ్యాప్తంగా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పోలీసులు సిమి జాతీయాధ్యక్షుడు బదర్‌తో పాటు మరో ముగ్గురు ఆఫీసు బియరర్లనుఅరెస్టు చేశారు. ఒక కౌన్సిలర్‌ను కూడా అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం వరకు 75 మంది సిమి నేతలను, కార్యకర్తలను పోలీసులుఅరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X