వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది అమెరికాలో ప్రదర్శనలు నిర్వహించారు. వేలాది మంది యుద్ధ వ్యతిరేక ప్రదర్శనకారులు శాన్‌ఫ్రాన్సిస్కో వీధుల్లోకి వచ్చారు.వీరిలో గ్లోబలైజేషన్‌ వ్యతిరేక మిలిటెంట్లు కూడా వున్నారు.

అమెరికా రాజధానిలో ప్రదర్శనకారులు అధికారవర్గాలతో ఘర్షనకు దిగారు. యుద్ధం హింసను పెంచుతుందనేవిషయం తమకు తెలుసునని ఇంటర్నేషనల్‌ ఆన్సర్‌కు చెందిన బ్రెయిన్‌ బెకర్‌ అన్నారు. యుద్ధ వ్యతిరేక ప్రదర్శనకారులు వైట్‌హౌస్‌కు కొద్ది దూరంలో సమావేశమయ్యారు.

ఉగ్రవాదానికి పునాదులు వేస్తోంది అమెరికాయేననిప్రదర్శనకారులు విమర్శించారు. న్యూయార్క్‌, వాషింగ్టన్‌లలో దాడులు ఎందుకు జరిగాయనేవిషయంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం వున్నదని పాస్టర్స్‌ ఫర్‌ పీస్‌ డైరెక్‌టర్‌ ఎగ్జిక్యూటివ్‌ రెవరెండ్‌ లుసియస్‌ వాకర్‌ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అమెరికా సైనిక శక్తిని, కార్పోరేట్‌ అమెరికాను ప్రయోగించడం వల్లనే ఆ దాడులు జరిగాయని ఆయన అన్నారు.
వాషింగ్టన్‌లో జరిగిన ప్రదర్శనలో దాదాపు ఐదు వేల మంది పాల్గొన్నారు. నో వార్‌ నో ఫియర్‌, లవ్‌ నాట్‌ ఫియర్‌, హీల్‌ డోంట్‌ హర్ట్‌ వంటి నినాదాలు రాసి వున్న బ్యానర్లను, జెండాలను, పోస్టర్లను ప్రదర్శించారు.

జర్మనీ, ఆస్ట్రేలియాల్లో కూడా యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X