• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హైజాక్‌ డ్రామాపై వాజ్‌పేయి గరం

By Staff
|

న్యూఢిల్లీః అంతర్జాతీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో బుధవారం అర్థరాత్రి సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన హైజాక్‌ డ్రామాపై ప్రధాని వాజ్‌ పేయి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు గంటలపాటు గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన ఈ సంఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. పౌరవిమానయాన శాఖ మంత్రి షా నవాజ్‌ ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేసి వాజ్‌ పేయి సీనియర్‌ అధికారులతో కూడిన మరో కమిటీని నియమించడం చూస్తే ఈ సంఘటనపై ఆయన ఎంత తీవ్ర స్పందించారో అర్థం అవుతుంది.

ఇది మాక్‌ డ్రిల్‌ కాదని, కేవలం ఓ ఫోన్‌ కాల్‌ రావడంతో అధికారులు అతిగా స్పందించడంతో ఈ డ్రామా సాగిందని మంత్రి షానవాజ్‌ ప్రకటించారు. పౌరవిమానయాన శాఖ అధికార గణంపెనునిద్దర పోతున్నారని నిరూపించే ఈ సిగ్గుచేటైన సంఘటన ఎలా జరిగిందో తేల్చి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని వాజ్‌పేయి భావించారు. దీనితో మంచి పేరున్న అధికారులతో కమిటీ నిర్ణయించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X