వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్‌, అమెరికాల్లో యుద్ధ వ్యతిరేకత

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌ః అగ్రరాజ్యం అమెరికా ఆ దేశానికి వత్తాసునిస్తున్న బ్రిటన్‌లో పాలకులు యుద్ధ కాంక్షతో రగిలిపోతున్నప్పటికీ ప్రజలంతా వారికి మద్దతుగా లేరు. అఎn్గానిస్తాన్‌పై అమెరికన్‌ బాంబర్లు విరుచుకుపడిన 24 గంటల్లోనే ఇటు అమెరికాలో అటు బ్రిటన్‌లో యుద్ధం దేనికీ పరిష్కారం కాదని హెచ్చరిస్తూ వేలాది మంది ప్రజలు ప్రదర్శనలకు దిగారు.

లండన్‌లోని చారిత్రాత్మకమైన ట్రాఫాల్గర్‌స్వేర్‌ వద్ద, న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద సోమవారం నాడు వేలసంఖ్యలో ప్రజలు శాంతి ప్రదర్శనలో పాల్గొన్నారు. టెర్రరిస్టులను దండించాల్సిందేనని అయితే టెర్రరిస్టులపీచమణిచే పేరుతో బక్కప్రాణి అఎn్గాన్‌పై బాంబులను గుప్పించడంలోఅర్ధం లేదని ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నవారు పేర్కొన్నారు. పట్టుమని 10 డాలర్లవిలువ కూడా చేయని టెంట్లపై లక్షలాది డాలర్లవిలువజేసే క్రూయిజ్‌ క్షిపణులను ప్రయోగించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అంతర్గత యుద్ధం, కరవుతోఅఎn్గాన్‌ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని వారిపై నిర్ధయగా యుద్ధం ఎక్కుపెట్టడం అన్యాయమని వారుపేర్కొన్నారు.

వరల్డ్‌ ట్రేడ్‌సెంటర్‌పై జరిగిన దాడుల్లోనే వేలాది మంది ఆహుతయ్యారని ఈ బలిదానం చూసిన తర్వాత మరిన్ని చావులను కళ్ల చూడాలని మనిషన్నవాడు ఎలాకోరుకోగలడని న్యూయార్క్‌ ప్రదర్శకుడు ఒకరు ప్రశ్నించారు. చమురు సంపన్న ప్రాంతాలపై తిరుగులేని పట్టుకు అమెరికా ఈ యుద్ధం ప్రారంభించినట్టుగా అనిపిస్తున్నదని కొందరు ప్రదర్శకులు వ్యాఖ్యానించారు. ఇదిలా వుండగా ముస్లీం రాజ్యాల్లో మాత్రం పరిస్థితి తీవ్రంగా వున్నది. ముఖ్యంగా పాకిస్తాన్‌ అమెరికా వ్యతిరేక ప్రదర్శనలతో అట్టుడుకుతున్నది. బంగ్లాదేశ్‌లో కూడా భారీ ఎత్తునఅఎn్గాన్‌ అనుకూల ప్రదర్శనలు జరిగాయి. కల్లోల కాశ్మీరంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి కనిపిస్తున్నది. ముస్లీం దేశాలు అమెరికా దాడులను మనస్ఫూర్తిగా సమర్ధించడం లేదు. ఈజిప్ట్‌, టర్కీ వంటి దేశాలుపైకి మాత్రం అమెరికాకు బేషరతుగా మద్దతు ప్రకటించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X