అమెరికాకు బుఖారీ హెచ్చరిక
న్యూఢిల్లీః అఎn్గానిస్తాన్పై అమెరికా దాడులను ఢిల్లీ జమా మసీదు ఇమామ్ సయీద్ అహ్మద్ బుఖారీ తీవ్రంగా ఖండించారు. దేశంలోని అతిపెద్ద మసీదుల్లో ఒకటైన జమా మసీదులో శుక్రవారం నాడు ప్రార్ధనల తర్వాత ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.
శుక్రవారం ప్రార్ధనలకు సుమారు 10 వేల మందిహాజరయ్యారు. అఎn్గాన్పై దాడులకు వ్యతిరేకంగా బుఖారీ సారథ్యంలో ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహించాలని కూడా నిర్ణయించారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఈ ర్యాలీ ప్రతిపాదనను కట్టిపెట్టారు. ప్రార్ధనల తర్వాత మసీదు వెలుపలపెద్దసంఖ్యలో గుమికూడిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేప్పుడు ఉద్వేగాన్ని తట్టుకోలేక ఒక్కపెట్టున ఏడ్చారు.
కాబూల్, కాశ్మీర్, పాలస్తీనాల్లో అమరులకు జోహార్లు తెలపండిని అన్నారు. ముస్లీంలకు అల్లా అండ తప్ప ఆయుధాలు లేవని ఆయన అన్నారు. న్యూయార్క్ దాడుల్లో మరణించినవారికోసం కన్నీరుమున్నీరైవిలపిస్తున్న పశ్చిమదేశాలు అఎn్గాన్లో మరణించిన వారికోసం ఒక్కకన్నీటి బొట్టు కూడా కార్చడం లేదని ఆయన దుయ్యబట్టారు. బుఖారీ ప్రసంగిస్తున్నంతసేపు మసీదు ప్రాంగణం అల్లా హో అక్బర్, అమెరికా నశించాలి.. నినాదాలతో దద్దరిల్లింది. అమాయకఅఎn్గాన్లపై సాగిస్తున్న రాక్షసకాండకు అమెరికా మూల్యం చెల్లించకతప్పదని ఆయన అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!