వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నన్‌, ఐరాసకు నోబెల్‌ శాంతి

By Staff
|
Google Oneindia TeluguNews

స్టాక్‌హోమ్‌ః ఐక్యరాజ్య సమితి సెక్రటరి జనరల్‌ కోఫీ అన్నన్‌కు, ఐక్యరాజ్యసమితికి ఉమ్మడిగా 2001 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ శాంతి పురస్కారం లభించింది. నోబెల్‌ శాంతికి అన్నన్‌ పేరు గత కొంతకాలంగా గట్టిగా వినిపిస్తున్న విషయం విదితమే. ఐక్యరాజ్యసమితికి ఆయన ఏడో సెక్రటరీ జనరల్‌. 1997 జనవరి నుంచి సమితి సెక్రటరీ జనరల్‌గా వున్న అన్నన్‌ సభ్యరాజ్యాలు ఏకగ్రీవంగా ఆమోదించడంతో ఈ మధ్యనే రెండోసారిగా కూడా సమితి సెక్రటరి జనరల్‌గా ఎన్నికయ్యారు.

ప్రపంచశాంతికి, వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతల తగ్గింపునకు ఐక్యరాజ్యసమితి, అన్నన్‌ చేసిన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రకటించారు.సెక్రటరి జనరల్‌గా ఐక్యరాజ్యసమతికి కొత్త జవజీవాలను కల్పించడంలో అన్నన్‌ చేసిన కృషి అసాధారణమైంది. ఆయన ఉద్యోగ జీవితమంతా ఐక్యరాజ్యసమితిలోనే గడిచిపోయింది.

ప్రపంచశాంతి, అంతర్జాతీయ భద్రతకు సంబంధించి ఐక్యరాజ్యసమితి సంప్రదాయక పాత్రను స్పష్టంగాఅర్ధం చేసుకున్న కోఫీ అన్నన్‌ ఆ దిశలో విశేషమైన కృషి చేయడంతో పాటు మానవహక్కుల రక్షణకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని నోబెల్‌ పురస్కార కమిటీ విడుదల చేసిన ఒక ప్రకటనలోపేర్కొంది. కర్తవ్య నిర్వహణలో జయాపజయాలు వున్నప్పటికీ ఏమాత్రం చెదరకుండా తన పనితాను చేసుకుపోతున్న కర్తవ్యదీక్షాపరుడు అన్నన్‌ అని ఆ ప్రకటన కొనియాడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X