వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణభారతంలోఅంత్రాక్స్‌ భయం

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నైః అంత్రాక్స్‌ వ్యాధి భయంతో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు గడగడ వణికిపోతున్నాయి. తమిళనాడులోని ముడమలై అడవి ప్రాంతంలో ఒక ఏనుగు అంత్రాక్స్‌ బారిన పడి మరణించినట్టుగా వచ్చిన వార్తలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ఈ వ్యాధి అడవిలోని ఇతర ఏనుగులకు వ్యాపించకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవల్సిందిగా అటవీ శాఖ అధికారులను ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. బాసిలస్‌అంథ్రాసిస్‌ అనే అరుదైన బాక్టీరియా వల్ల కలిగే ప్రమాదకరమైనఅంత్రాక్స్‌ వ్యాధి ఇప్పుడు యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్నవిషయం విదితమే.

జంతువులనుంచి ఈ ప్రాణాంతకమైన వ్యాధి మనుషులకు కూడా సోకే ప్రమాదం వుంది. ఈ వ్యాధి సోకిన జంతువులు వ్యాధి సోకిన ఎనిమిది గంటల్లోనే ముక్కునుంచి నోటినుంచి నల్లటి రక్తం కారుస్తూ మరణిస్తాయి. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోవిస్తరించి వున్న విశాల అటవీ ప్రాంతంలో పెద్దఎత్తున వున్న తోళ్ల పరిశ్రమలోని కార్మికులకు ఈ వ్యాధి సోకే ప్రమాదం వున్నదన్న భయాలు వ్యాపించాయి. దాంతో రెండు రాష్ట్రాలు యుద్ధ ప్రాతిపదికన ప్రమాదకరమైన ఈ వ్యాధి నివారణకుపెద్దఎత్తున చర్యలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అటవీ ప్రాంతాల్లోనూ తోళ్ల పరిశ్రమలోనూఅంత్రాక్స్‌ వ్యాధి ప్రమాదం వున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి కేంద్రీకరించింది.అంత్రాక్స్‌ నివారకుణ ఉపయోగించే ఔషధాలు దేశంలోవిరివిగా లభ్యమవుతున్న కారణంగా భయపడాల్సిన అవసరం లేదని అధికారులుఅంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X