For Daily Alerts
అమెరికా,పాక్ రహస్య ఒప్పందం
కాబూల్‌ః అఎn్గాన్‌పై దాడులకు సంబంధించి అమెరికా, పాకిస్తాన్ మధ్య రహస్య అవగాహన వున్నదని తాలిబన్ల వైరివర్గాలు ఆరోపిస్తున్నాయి. తాలిబన్లకు సంబంధించిన ఫ్రంట్‌లైన్ స్థావరాలను అమెరికా ధ్వంసం చేయడం లేదని నార్తర్న్ అలయెన్స్ కమాండర్ ఒకరు ఆరోపించారు.
తాముపురోగమించకుండా వుండటం కోసమే పాకిస్తాన్‌కోరికపై అమెరికా లోపలి ప్రాంతాల్లోని తాలిబన్ స్థావరాలనే లక్ష్యం చేసుకున్నదని ఆయన ఆరోపించారు. తాము కాబూల్ చేరుకోకుండా నిరోధించడమే పాకిస్తాన్ ధ్యేయమని ఆయన చెప్పారు. తాము కాబూల్‌ను ముట్టడించకుండా అమెరికా నిరోధించడం జార్జ్‌బుష్‌కే అవమానమని ఆయన వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఒకటి రెండు రోజుల్లో తాము కాబూల్‌ను ముట్టడించడం ఖాయమని ఆయన చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!