• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రెండో దశలోకిఅఎn్గాన్‌ యుద్ధం

By Staff
|

కాబూల్‌ః అఎn్గాన్‌పై అమెరికా సాగిస్తున్న ఏకపక్ష సమరం ఇప్పుడిక వ్యూహాత్మకంగా కీలకమైన రెండో దశలోకి ప్రవేశించనున్నది. గత ఏడురోజులుగా ఏకధాటిగా బాంబుల వర్షం కురిపించి తాలిబన్ల సైనిక స్థావరాలను, విమానాశ్రయాలను ధ్వంసం చేసిన అమెరికా ఇక భూభాగాన్ని తన అధీనంలోకి తెచ్చుకునే సన్నాహాల్లో పడింది.

పోరాటాన్ని భూమార్గం పట్టిస్తే తప్పఅఎn్గాన్‌ యుద్ధం లక్ష్యాలను సాధించడం కష్టమని అమెరికాసైనిక జనరల్స్‌ అంటున్నారు. లాడెన్‌ అప్పగింతకు అమెరికా అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ చేసిన తాజా హెచ్చరికను కూడా తాలిబన్లు పెడచెవినపెట్టడంతో విస్తృత స్థాయిలో పోరాటం అనివార్యమనిఅంటున్నారు. అమెరికన్‌ యుద్ధవిమానాలు, క్షిపణులు కీలక స్థావరాలను ధ్వంసం చేసినందుకుఅఎn్గాన్‌లో తమ కాల్బలాలకు ఎదురు వుండదన్న ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు.

అఎn్గాన్‌ యుద్ధం కొత్త దశలోకి ప్రవేశించనున్నదని జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్స్‌ జనరల్‌ రిచర్డ్‌ మైర్స్‌ కూడా చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నతందాఅసలు యుద్ధానికి పూర్వరంగం సిద్ధం చేయడం మాత్రమేనని కూడా ఆయన అన్నారు. ఇప్పటికేస్పెషల్‌ ట్రూప్స్‌ను కమెండో బలగాలను అమెరికాఅఎn్గాన్‌ సరిహద్దు ప్రాంతాలకు చేరవేసినట్టుగా చెబుతున్నారు. ఇదిలా వుండగాఅఎn్గాన్‌ భూభాగాన్ని ఆక్రమించే యోచన తమకు లేదని సంప్రదాయ యుద్ధాల్లో మాదిరిగా నలువైపులనుంచిసైన్యం కమ్ముకుని పోవడం అఎn్గాన్‌లో జరగదనిబ్రిటన్‌ వెల్లడించింది. విచ్చలవిడిగా బాంబుల వర్షం కురిపించే ఉద్దేశ్యం కూడా లేదనిబ్రిటన్‌ వెల్లడించింది. ఎంపిక చేసిన టార్గెట్లపై మాత్రమే దాడులు చేయాలన్నది తమ నిర్ణయమనిబ్రిటన్‌ పేర్కొంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Get Instant News Updates
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more