• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆల్‌-ఖైదా ప్రమాదకర సవాల్‌: వాజ్‌పేయి

By Staff
|

న్యూఢిల్లీ: అమెరికాతో తనకున్న శుత్రుత్వంలోకి ఒసామా బిన్‌ లాడెన్‌ ఆల్‌- ఖైదా వ్యవస్థ కాశ్మీర్‌ను కూడా లాగడాన్ని తీవ్రమైన సవాల్‌గా ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అభివర్ణించారు.

కాశ్మీర్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులకు అమెరికా సహాయం చేయకూడదనే ఆల్‌ ఖైదావిజ్ఞప్తి నిజమైతే అది తీవ్రమైన సవాల్‌ అని, దాన్ని మనం ఐక్యంగా ఎదుర్కోవాలని ఆయన అన్నారు. మంత్రి వర్గవిస్తరణ అనంతరం ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.

కాశ్మీర్‌లో భద్రతా కార్యకలాపాలను పెంచుతారా అనివిలేకరులు అడిగితే ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో వున్నదని, అమసరమైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన సమాధానమిచ్చారు.అఎn్ఘానిస్థాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌ లాభపడుతోందనే వాదనను ఆయన వ్యతిరేకించారు.

నిజానికి పాకిస్థాన్‌ ఇబ్బందుల్లో పడింది. భారత దౌత్య కార్యకలాపాలుసరైన దిశలో కొనసాగుతున్నాయి అని ఆయన అన్నారు.అఎn్ఘానిస్థాన్‌పై అమెరికా దాడుల వల్ల భారతదేశంలో అల్లర్లకు అవకాశం వుందా అని అడిగితే ప్రభుత్వం కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేసిందని, అంతర్గత భద్రతకు ఏ విధమైన ముప్పు కనిపించడం లేదని ఆయన జవాబిచ్చారు. కాశ్మీర్‌ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశమనే అమెరికా ఉప మంత్రి రిచర్డ్‌అర్మిటాగ్‌ అభిప్రాయాన్ని ఆయన తిరస్కరించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Get Instant News Updates
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more