ఆమెరికాపై మళ్ళీ దాడికి లాడెన్ రెడీ
వాషింగ్టన్ః అమెరికాపై మరిన్ని ఉగ్రవాద దాడులు జరిగే ప్రమాదం వున్నదని పలు దేశాల ఇంటిలిజెన్స్ వర్గాలు భయపడుతున్నాయి. లాడెన్ ఆయన అనుయాయుల సంభాషణల్నివిశ్లేషించిన పలు దేశాల ఇంటిలిజెన్స్ వర్గాలు మరో ఉగ్రవాద దాడికి రంగం సిద్ధం అవుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు.పేలుళ్ళు ద్వారా కానీ, రసాయన, జీవ రసాయన ఆయుధాల ద్వారా కానీ ఉగ్రవాదులు దాడులు నిర్వహించే ప్రమాదం వున్నదని భావిస్తున్నారు.సెప్టెంబర్ 11న జరిగిన మొదటి దాడితో పాటు మరొకటి, రెండు దాడులు జరిగుతాయని ఇంటిలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఆంత్రాక్స్ దాడులకు లాడెన్ కు సంబంధం వున్నట్లు ఇంతవరకు ఎటువంటి ఆధారాలు లభించలేదని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
సెప్టెంబర్
11న
అమెరికా
పై
దాడి
జరపడానికి
ముందు
లాడెన్
సిరియాలో
వున్న
తన
భార్యతో
జరిపిన
సంభాషణను
మూడు
యూరప్
దేశాల
ఇంటిలిజెన్స్
అధికారులు
రికార్డు
చేశారు.
వెంటనే
నువ్వు
ఆఫ్ఘనిస్తాన్
వచ్చేయ్అంటూ
లాడెన్
తన
భార్యకు
చెప్పాడని,
ఈ
సమాచారాన్ని
అమెరికా
ఇంటిలిజెన్స్
వర్గాలకుఅందించినా
ఫలితం
లేకపోయిందని
ఆ
పత్రిక
తెలిపింది.
అమెరికా
ఇలా
శరపరంపరగా
దాడులు
జరుగుతున్నా
లాడెన్
మాత్రం
మౌనంగా
వుండడం
వెనుక
ఏదో
దూరాలోచన
వుండి
వుంటుందని,దెబ్బలన్నీ
భరించి
అంతా
ఆదమరచి
వున్నప్పుడు
అమెరికాను
మరో
చావుదెబ్బ
తీసేందుకు
లాడెన్
వ్యూహం
రూపొందిస్తున్నాడనే
అనుమానాలు
కూడా
వ్యక్తం
అవుతున్నాయి.