• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆర్టీసి సమ్మె మరింత ఉధృతం

By Staff
|

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసి) సమ్మె మరింత ఉధృతమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసి ఉద్యోగులు సోమవారంనాడు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. పోలీసుల భద్రతతో బస్సులను నడిపించడానికి ప్రయత్నించడంతో అక్కడక్కడాస్వల్ప ఘర్షలు జరిగి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల ఆందోళకారులను పోలీసులుఅరెస్టు చేశారు. అరెస్టయినవారిలో శాసనసభ్యులు కూడా వున్నారు.

కర్నూలులో పోలీసులు 120 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల లాఠీఛార్జీకి నిరసనగా సిపిఎం కార్యకర్తలు కర్నూలులో ధర్నా నిర్వహించారు. తిరుపతిలో ఆర్టీసి ఉద్యోగులు రీజినల్‌ మేనేజర్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతపురంలో పికెటింగ్‌ జరిగింది. క్యాజువల్స్‌తో బస్సులను నడపడానికి ప్రయత్నించినప్పుడు ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతోస్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. వరంగల్‌లో ఆందోళనకారులుఅర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు.

పోలీసుల భద్రతతో బస్సులను నడిపించడానికి రాజమండ్రిలో ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నాలను ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఇక్కడ శాసనసభ్యులు జక్కంపూడి రామ్మోహన్‌ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరులో ఆందోళనకు దిగిన శానసభ్యుడు ఆనంవివేకానంద రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

కొత్తగా 1150 మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ఆర్టీసి యాజమాన్యం ప్రకటించింది. విధులకు హాజరవుతున్న క్యాజువల్స్‌ను పర్మినెంట్‌ చేస్తామని,గైర్హాజరవుతున్నవారిని తొలగిస్తామని యాజమాన్యం చెప్పింది. మాజీసైనికులను, హోంగార్డులను తీసుకుని బస్సులను నడిపించే ప్రయత్నాలకు యాజమాన్యం పూనుకుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more