వరదబాధితులకు మరింత సాయం
న్యూఢిల్లీ:దేశం వెలుపల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై దాడికి అంతర్జాతీయచట్టం అనుమతిస్తున్నప్పటికీ సరిహద్దు దాటకుండనే భారత్‌ఉగ్రవాదంపై సమరం సాగించగలదని హోం మంత్రిఎల్.కె. అద్వానీ అన్నారు.
సరిహద్దునుదాటాలని మేం అనుకోవడం లేదు. మేం విజయంసాధించినప్పటికీ కార్గిల్ యుద్ధ సమయంలో కూడామేం ఆ పని చేయలేదు. సరిహద్దు దాటి పోరుచేయడానికి అంతర్జాతీయ చట్టం అనుమితిస్తుంది. కానీమేం ఆ పని చేయం అని ఆయన అన్నారు.
కార్గిల్ అమరవీరుడురాజీవ్ రాజీవ్ పుందీర్‌కు భార్యకు ఇచ్చిన పెట్రోల్ పంపును ప్రారంభించిన అనంతరంఆయన మాట్లాడారు.పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోనిఉగ్రవాద శిబిరాలపై భారత ప్రభుత్వం ఎందుకుదాడులు నిర్వహించదని ప్రజలు అడుగుతున్నారని, అయితే ప్రభుత్వంసరిహద్దుల లోపలి నుంచే సమస్యనుఎదుర్కోగలదని ఆయన అన్నారు. ఫోఖ్రాన్ అణుపరీక్షలు, కార్గిల్‌యుద్ధం వంటి ప్రభుత్వ విజయాలు దేశస్థిరత్వంపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందిచగలవనిఆయన అన్నారు. భద్రత అనేది అత్యంత ముఖ్యమైందని, భద్రత ఉన్నప్పుడే అభివృద్ధిసాధ్యమని ఆయన అన్నారు