వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అంత్రాక్స్తో పోస్టల్ ఉద్యోగుల మృతి
న్యూయార్క్ః అమెరికాలో అంత్రాక్స్తో ఇద్దరు పోస్టల్ ఉద్యోగులు మరణించడంతో పోస్టల్ శాఖ ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. ఇద్దరు పోస్టల్ ఉద్యోగులు మరణించిన మాట నిజమే అయినప్పటికీ వారు అంత్రాక్స్తోనే మరణించరనడానికి ఆధారాలు లేవని ప్రభుత్వం ప్రకటించింది.
వారి మరణానికి కారణాలు నిర్ధారించనున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది.అయినప్పటికీ పోస్టల్ ఉద్యోగుల్లో ఏర్పాడిన భయాందోళనలు ఏ మాత్రం తగ్గలేదు. వేలాది మంది పోస్టల్ ఉద్యోగులుఅంత్రాక్స్ నిర్ధారణ పరీక్షల కోసం ఆస్పత్రుల ముందు క్యూలు కడుతున్నారు. మరోవైపు అనేక మంది ఉద్యోగులు ముందుజాగ్రత్త చర్యగా యాంటీబయోటిక్స్ వాడకం ప్రారంభించారు. పరిస్థితి ఈ విధంగానే వుంటే మాస్ హిస్టిరియా తలెత్తే ప్రమాదం వున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.