వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తాలిబాన్‌తో సంబంధాలు లేవు: చైనా
బీజింగ్: తాలిబాన్‌తో తమకు ఏ విధమైన సంబంధాలు లేవని చైనా ప్రకటించింది. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు మిలియన్ల కొద్ది డాలర్ల సహాయం అందించినట్లు వచ్చిన వార్తలను కూడా చైనా ఖండించింది.
తాము చైనాతో సంబంధాలు కొనసాగిస్తున్నామని, అమెరికాపై పోరుకు తమకు చైనా సహకరిస్తోందని తాలిబాన్ కమాండర్-ఇన్-చీఫ్ జలాలుద్దీన్ చేసిన ప్రకటనను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సున్ యుగ్జీ విలేకరుల సమావేశంలో ఖండించారు. గతంలో చైనాకు అఎn్ఘానిస్తాన్‌లోని తాలిబాన్‌తో పాటు అన్ని వర్గాలతో సంబంధాలుండేవని, సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాలో జరిగిన దాడుల తర్వాత తాలిబాన్‌తో తాము సంబంధాలను కొనసాగించడం లేదని సున్ అన్నారు.