• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముస్లీములపై అమెరికా మతయుద్ధం

By Staff
|

ఇస్లామాబాద్‌ః అమెరికా తమపై జరుపుతున్న దాడులను క్రూసెడ్‌( క్రిస్టియన్స్‌ ముస్లీంలకు వ్యతిరేకంగా సాగించే మతయుద్ధం) గా తాలిబన్లు ప్రకటించారు.

దీర్ఘకాలిక పోరాటానికి తాము సిద్ధంగా వున్నామని పాకిస్తాన్‌లోని తాలిబన్‌ రాయబార కార్యాలయంసీనియర్‌ అధికారి షా వలీ ప్రకటించారు. అఎn్గాన్‌ గడ్డపై అడుగుపెట్టిన అమెరికన్‌సైనికులను ఎదుర్కునేందుకు తాలిబన్‌ సేనలు సిద్ధంగా వున్నాయని ఆయన ప్రకటించారు.

అమెరికాఅఎn్గాన్‌ పౌరులపై అత్యంత ఆధునిక, విధ్వంసకర ఆయుధాలను ప్రయోగిస్తున్నదని ఆయన చెప్పారు. తాలిబన్లను ఎదుర్కులేక అమాయకపౌరులపై అమెరికా తన దాడులను గురిపెట్టిందని ఆయన దుయ్యబట్టారు.అఎn్గాన్‌పై జరుగుతున్న దాడులను తాము టెర్రరిజం పై పోరుగా పరిగణించడం లేదని ఈ దాడులు ముస్లీములకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన క్రూసెడ్లుగా భావిస్తున్నామని ఆయన చెప్పారు.

కనీసం 50 మంది అమెరికన్‌ కమెండోలు తమకు బందీలుగా చిక్కినట్టు వెల్లడించారు. హెరత్‌లోని ఒక ఆస్పత్రిపై అమెరికా బాంబులు వేయడం వల్ల వందమంది అక్కడికక్కడే మరణించినట్టు ఆయన చెప్పారు. ముస్లీములను హతమార్చే ఉద్దేశ్యంతో కావాలనే జనావాసాలపై అమెరికన్‌ దళాలు బాంబులు రువ్వుతున్నట్టుగా ఆయన తెలిపారు. హెరత్‌ జిల్లాలోని ఒక మసీదుపై కూడా అమెరికా బాంబులు వేసిందని ఈ దాడిలో మసీదులో ప్రార్ధనలు చేస్తున్న 15 మంది అక్కడికక్కడే మరణించారని కూడా తాలిబన్ల ప్రతినిధి వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X