వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సైబరాబాద్ మాస్టర్‌ప్లాన్ రెడీ
హైదరాబాద్‌ః దేశంలోనే అత్యంత శుభ్రమైన టౌన్‌షిప్ ప్రాంతంగా సైబరాబాద్‌ను తీర్చిదిద్దనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినమైన నవంబర్ ఒకటవ తేదీన సైబరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీ ఏర్పాటును ప్రకటించనున్నట్టుగా అధికారవర్గాలు చెప్పాయి.
కొత్త ఇళ్ల నిర్మాణానికి లేఅవుట్‌లకు అనుమతి, భూమి వినియోగం, ఎఫ్‌ఎస్‌ఐ తదితర వాటిని మాస్టర్ ప్లాన్‌లో పొందుపర్చారు. శేరిలింగంపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 17 గ్రామాలకు చెందిన 51.70 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్నిటౌన్‌షిప్ డెవలప్‌మెంట్ కోసం గుర్తించారు.